Share News

Hyderabad: టీ తాగుతుండగా.. కత్తులతో దాడి

ABN , Publish Date - Aug 06 , 2025 | 06:37 AM

జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఓ రౌడీషీటర్‌ మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు హాటల్‌లో టీ తాగుతున్న వ్యక్తిని బయటకు లాగి అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తులతో పొడిచి, వేటకొడవలితో తలపగలగొట్టి హత్యచేశారు.

Hyderabad: టీ తాగుతుండగా.. కత్తులతో దాడి

- రౌడీషీటర్‌ దారుణ హత్య

- జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఘటన

- లొంగిపోయిన నిందితులు

- ఆర్థిక లావాదేవీలే కారణం: పోలీసులు

హైదరాబాద్: జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఓ రౌడీషీటర్‌ మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు హాటల్‌లో టీ తాగుతున్న వ్యక్తిని బయటకు లాగి అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తులతో పొడిచి, వేటకొడవలితో తలపగలగొట్టి హత్యచేశారు. ఆ తర్వాత నిందితులు నేరుగా జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌(Jagadgirigutta Police Station)కు వెళ్లి పోలీసులకు లొంగిపోయారు. బాలానగర్‌ డీసీపీ సురే్‌షకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ కుమారుడు షేక్‌ మొహమూద్‌(35) పాత నేరస్తుడు.


ఇతనిపై ముషీరాబాద్‌ పోలీస్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదై ఉంది. ఇతనిపై 13కేసులు కూడా ఉన్నాయి. ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన కరీం, జహంగీర్‌, ఫజల్‌ కలిసి కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో మాట్లాడాలని మొహమూద్‌ను పిలిపించారు. అతను ఎల్లమ్మబండ చౌరస్తాలో ఓ రెస్టారెంట్‌లో కూర్చుని టీ తాగుతుండగా, పఽథకం ప్రకారం ఆటోలో వచ్చిన కరీం, జహంగీర్‌, ఫజల్‌లు కత్తులు, వేటకొడవలితో హాటల్‌లో ఉన్న మొహమూద్‌పై దాడిచేసి విచక్షణా రహితంగా కడుపులో, వీపుపై పొడిచారు.


అదేవిధంగా వేడకొడవలితో తల వెనుక భాగంలో కొట్టడంతో తలపగిలింది. హోటల్‌ మెట్లముందు రక్తపు మడుగులో పడి మొహమూద్‌ ప్రాణాలు వదిలాడు. ఈ హఠాత్పరిణామమంతో భీతిల్లిపోయిన హోటల్‌ యాజమాన్యం, సిబ్బంది, ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


city1.jpg

సంఘటనా స్థలానికి బాలానగర్‌ డీసీపీ సురేష్‏కుమార్‌, ఏసీపీ నరేష్‏రెడ్డి వచ్చి పరిశీలించారు. క్లూస్‌టీం, ఫింగర్‌ప్రింట్స్‌ టీంలు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్య చేసిన అనంతరం నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే, ఈ హత్యకు మూలకారణం పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 06:37 AM