Share News

Hyderabad: ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో గంజాయి రవాణా

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:40 AM

విజయవాడ నుంచి ఔరంగాబాద్‌కు వయా హైదరాబాద్‌ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ ఆటకట్టించారు సెంట్రల్‌జోన్‌ పోలీసులు. ఓ మహిళతో పాటు మరో స్మగ్లర్‌ను దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో గంజాయి రవాణా

- ఓ మహిళా స్మగ్లర్‌ సహా.. ఇద్దరి అరెస్టు

- 18 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: విజయవాడ నుంచి ఔరంగాబాద్‌కు వయా హైదరాబాద్‌(Hyderabad) మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ ఆటకట్టించారు సెంట్రల్‌జోన్‌ పోలీసులు. ఓ మహిళతో పాటు మరో స్మగ్లర్‌ను దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 18 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీ శిల్పవల్లి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


దోమలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లిబర్టీ టీ జంక్షన్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఎదురుగా ఓ మహిళ, మరో యువకుడు రెండు బ్యాగులతో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్న సమాచారంతో దోమలగూడ పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన క్రమంలో మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన కోమల్‌ సోమినాథ్‌ పవార్‌, సాహిల్‌ మహేష్‌ సాలుంగా తేలింది.


city5.2.jpg

స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకునే ఇద్దరూ వచ్చే ఆదాయం సరిపోక, సులభంగా డబ్బు సంపాదించాలని గంజాయి స్మగ్లింగ్‌ను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. విజయవాడ(Vijayawada)లోని బాబు అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, దాన్ని బస్సు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా ఔరంగాబాద్‌కు తరలిస్తున్నారు. అక్కడ గంజాయి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయుంచి, సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 08:40 AM