Share News

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:40 AM

నగరంలోని జవహర్‌ నగర్‌ హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోసం చేశాడన్న కారణంతో ఆగ్రహానికి గురై అతడిని అంతం చేసినట్లు పొలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

- జవహర్‌ నగర్‌ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌

- పిస్టల్‌, తపంచా, 8 లైవ్‌ రౌండ్లు, 4 కత్తులు స్వాధీనం

హైదరాబాద్: సాకేత్‌ కాలనీ(Saket Colony)లో సంచలనం రేపిన వెంకటరత్నం హత్య కేసును ఛేదించారు. ఆరుగుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు(Rachakonda CP Sudheer Babu) వెల్లడించారు. సోమవారం ఉదయం సాకేత్‌ కాలనీలోని ఓ పైవ్రేట్‌ పాఠశాలలో తన కుమార్తెను విడిచిపెట్టి వస్తుండగా మార్గమధ్యంలో దుండగులు వెంకటరత్నంపై కత్తులు, తుపాకీతో దాడి చేయగా అక్కడిక్కడే మృతిచెందాడు. కాగా, మంగళ్‌హాట్‌, దూల్‌పేట్‌ ప్రాంతాల్లో డాన్‌ సుదేశ్‌సింగ్‌కు వెంకటరత్నం ప్రధాన అనుచరుడిగా పనిచేసేవాడు.


2001లో సుదేశ్‌సింగ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించగా, తన తండ్రి ఆస్తులన్నీ వెంకటరత్నం తీసుకుని కుటుంబాన్ని మోసం చేశాడని చందన్‌సింగ్‌ అతడిపై కక్ష్య పెంచుకున్నాడు. ఇటీవల ఈ పాతకక్షలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో చందన్‌ సింగ్‌(33), కమరపూర్‌ నరేష్‌, వడ్డెర వెంకట నారాయణ, నంద్యాల పవన్‌ కుమార్‌, నర్సింగ్‌, ఓ మైనర్‌ బాలుడితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.


city5.2.jpg

ముందస్తు ప్రణాళిక ప్రకారమే వెంకటరత్నం పై కత్తులు, తుపాకీతో దాడి చేసి అంతమెందించారు. నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 1 పిస్తోల్‌, 1 తపంచా, 8 లైవ్‌ రౌండ్లు, 4 కత్తులు, ఒక ఆటో, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్‌ హత్య కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని సీపీ సుధీర్‌ బాబు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2030 నాటికి అమెజాన్‌ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు

3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 09:44 AM