Hyderabad: అమ్మో.. రూ.86 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 08:56 AM
రెండు నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్‌గూడలో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్, మే నెలల్లో ట్రేడింగ్ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్‌లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.
నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో బురిడీ
హైదరాబాద్ సిటీ: రెండు నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్‌గూడ(Yusufguda)లో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్, మే నెలల్లో ట్రేడింగ్ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్‌లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.
వారు చెప్పినట్లుగా లాభాలు వచ్చినట్లు యాప్‌లలో చూపించారు. కానీ, విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోగా తాను పెట్టిన పెట్టుబడి సైతం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయుంచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News