Hyderabad: వందకాదు.. వెయ్యికాదు.. రూ. 14.34 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:26 AM
హైదరాడాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 14.34 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
- 14.34 లక్షలు కాజేశారు!
- ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14.34 లక్షలు కాజేశారు. కాచిగూడకు చెందిన వ్యక్తి(27)ని వాట్సప్(WhatsApp) ద్వారా సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఫైరీస్ డీఎంఏ ట్రేడింగ్ ప్రతినిధులమని చెప్పుకున్న నేరగాళ్లు బాధితుడిని వాట్సప్ గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.17.94 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు.

యాప్‌లో లాభం వచ్చినట్లు చూపిన నేరగాళ్లు ముందుగా రూ.3.60 లక్షలు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మిగతా సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, ఇంకా రూ.15లక్షలు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News