Share News

Hyderabad: ‘బ్లింక్‌ ఇట్‌’ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:57 AM

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్‌ ఇట్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్‌ పెట్టాడు.

Hyderabad: ‘బ్లింక్‌ ఇట్‌’ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే.. తర్వాత ఏం జరిగిందంటే..

- రూ. 1.40 లక్షలు కాజేత

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals). టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్‌ ఇట్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్‌ పెట్టాడు. వచ్చిన ఆర్డర్‌లో ఒక వస్తువు తగ్గడంతో ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో బ్లింక్‌ ఇట్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం వెతికాడు.


గూగుల్‌(Google)లో లభించిన నంబర్‌కు ఫోన్‌ చేశాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్‌ కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు ఫిర్యాదు గురించి తెలుసుకున్నాడు. మీ డబ్బు వాపస్‌ రావాలంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచిస్తూ వేరే నంబర్‌కు కాల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఫోన్‌లో మాట్లాడిన సైబర్‌ నేరగాడు స్ర్కీన్‌ షేరింగ్‌ చేయాలని సూచించాడు.


city1.2.jpg

స్ర్కీన్‌ షేరింగ్‌ సమయంలో ఫోన్‌పే ద్వారా జరిగిన చెల్లింపులను చూపించాలని, డీ ఫాల్ట్‌ బ్యాంకు మార్చాలని కోరాడు. అదే సమయంలో బాధితుడి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 06:57 AM