Hyderabad: మనోడి ఐడియా మామూలుగా లేదుగా.. ఏం చేశాడో తెలిస్తే..
ABN , Publish Date - Apr 30 , 2025 | 08:32 AM
డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఎలాగైనా సంపాదించాలి. అందుకోసం ఎంతకైనా రెడీ అవుతున్నారు. అవతలి వారు ఏమైపోయినా.., అది అక్రమమా, సక్రమమా అవసరం లేదు. ఎలాగైనా సంపాదించాలి. ఇదే టార్గెట్.. ఈ కోవలోనే పయనించిన ఓ యువకుడు చివరకు అక్రమ మార్గంలో వెళ్లి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నుంచి తగినంత ఆదాయం లేదని..
- డబ్బు కోసం గంజాయి దందా..
- నిందితుడి అరెస్ట్.. 1.10 కిలోల సరుకు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్(Fast food center) నుంచి తగినంత ఆదాయం లేకపోవడంతో ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా ఫూల్‌బనీ జిల్లా, దిమ్రిగూడకు చెందిన సునీల్ బింధని అలియాస్ మీలు (29)పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తమిళనాడు నాందేడ్ ప్రాంతాల్లో కాటన్, టెక్స్‌టైల్ మిల్లుల్లో కార్మికుడిగా పనిచేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్నేహితుడే హంతకుడు..
లాక్‌డౌన్(Lockdown) సమయంలో స్వస్థలానికి వెళ్లి బతుకుదెరువు కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. దానిద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒడిశాలో ఓ వ్యక్తి వద్ద నుంచి కిలో రూ. 5 వేలకు గంజాయి కొని నగరానికి చేరుకున్నాడు. అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రాణీగంజ్(Raniganj) వద్ద కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న సునీల్ బింధనిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1.10 కిలోల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News