Hyderabad: స్నేహితుడే హంతకుడు..
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:47 AM
ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడ్డ వైరం చివరకు హత్య వరకు వెళ్లింది. తనపై లేనిపోని విషయాలను బయటి వ్యక్తులకు చెబుతున్నాడంటూ అనుమానం పడి ఎలాగైనా అతడిని కడతేర్చాలని కోపం పెంచుకొని బండరాయితో కొట్టి చంపాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు
- నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: హత్య కేసును దోమలగూడ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాంధీనగర్ ఇన్‌చార్జి ఏసీపీ గురు రాఘవేంద్ర, దోమలగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, సూర్యాపేట(Suryapet)కు చెందిన పాత నేరస్థుడు చేపూరి నరేందర్(40) కూలి పనులు చేసుకొని హిమాయత్‌నగర్‌లో ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు
చిక్కడపల్లి పీఎస్ పరిధిలో ఇటీవల ఓ మర్డర్ కేసులో జైలు జీవితం గడిపి విడుదలయ్యాడు. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాకు చెందిన అజయ్(32)తో అతడికి పరిచయం ఏర్పడడంతో స్నేహంగా ఉంటున్నారు. ప్రతీరోజూ వీరిద్దరూ కలిసి పనులకు వెళ్తుండేవారు. నరేందర్ తాను చేసిన పనులను అజయ్‌కి చెప్పాడు. అజయ్ అతడు చెప్పిన విషయాలను పనులు చేస్తున్నచోట చెప్పడంతో నరేందర్(Narendhar)ను పనులకు రానీయడం లేదు.

దీంతో అజయ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 27వ తేదీ రాత్రి అజయ్ నిద్రపోతుండగా బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పడేసి వెళ్లిపోయాడు. జి-ప్లాజా అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసీ సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసింది నరేంద్‌ర్‌గా గుర్తించి అతడిని మంగళవారం జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద పట్టుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News