Share News

Hyderabad: సీటు కోసం ఘర్షణ.. పిడిగుద్దులకు ఒకరి మృతి

ABN , Publish Date - May 03 , 2025 | 07:04 AM

ఒక చిన్న విషయం.. చివరికి ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. మద్యంషాపులో తలెత్తిన గొడవ నిండు ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ వివాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి జైలు పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సీటు కోసం ఘర్షణ.. పిడిగుద్దులకు ఒకరి మృతి

- ఆలస్యంగా వెలుగులోకి..

- పర్మిట్‌ రూంలో ఘటన

హైదరాబాద్: మద్యం తాగేందుకు వెళ్లిన ఓ యువకుడు పర్మిట్‌ రూంలో సీట్‌ కోసం తలెత్తిన వివాదంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కూకట్‌పల్లి(Kukatpally) పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట్‌లో నివాసం ఉండే కేశవ్‌, గాజులరామారంలో ఉండే ధనుష్‌ గౌడ్‌ (22) ఏప్రిల్‌ 5న కూకట్‌పల్లి మెయిన్‌రోడ్డులోని ఓ వైన్‌షాపులో మద్యం తాగారు. అక్కడ ఉన్న పర్మిట్‌ రూంలో కూర్చునేందుకు సీటుకోసం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై సీఎస్‌ తొలి సమీక్ష


city1.2.jpg

కేశవ్‌ కోపంతో ధను్‌షగౌడ్‌పై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సృహ కోల్పోయిన అతన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు నిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 1న మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్‌షాపులో సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేశవ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

Kishan Reddy: ఓల్డ్‌ సిటీకీ నిధులు కేటాయించాలి

పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2025 | 07:10 AM