Share News

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

ABN , Publish Date - Nov 14 , 2025 | 08:55 AM

ఏపీకే ఫైల్స్‌ పంపి, వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి హెచ్‌బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్‏లు వచ్చాయి.

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

- సైబర్‌ నేరగాళ్ల మోసం

హైదరాబాద్‌ సిటీ: ఏపీకే ఫైల్స్‌ పంపి, వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు(Cyber Criminals). సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి హెచ్‌బీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank) నుంచి రెండు ఎస్సెమ్మెస్‏లు వచ్చాయి. జంబో ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ నుంచి తన ఖాతాకు రెండు విడతలుగా రూ. 2,20,000, రూ. 1,71,000లు క్రెడిట్‌ అయినట్లు వాటి సారాంశం. బాధితుడు బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా అదే సమయంలో తన ఖాతా నుంచి రూ.4,00,000 డెబిట్‌ అయినట్లు తెలిసింది. అంటే రూ.9వేలు తిరిగి లాస్‌ అయ్యాడు.


city5.3.jpg

బ్యాంకు అధికారుల సూచన మేరకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించిన పోలీసులు ఇటీవల కాలంలో ఏదైనా మెసేజ్‌లు లింకులు వచ్చాయా అని ఆరా తీయగా ఆర్టీవో చలాన్‌ పేరుతో ఏపీకే లింకు వచ్చినట్లు గుర్తించారు. ఈ లింకును క్లిక్‌ చేసినప్పుడు నేరగాళ్లు ఫోన్‌ హ్యాక్‌ చేసి బాధితుని ఫోన్‌ను హ్యాండిల్‌ చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 08:55 AM