Share News

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య..

ABN , Publish Date - Aug 16 , 2025 | 07:08 AM

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడితో ఓ మృగాడు పైశాచికంగా వ్యవహరించాడు. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం అతడిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన షాకింగ్‌గా మారింది.

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య..
Crime News

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడితో ఓ మృగాడు పైశాచికంగా వ్యవహరించాడు. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం అతడిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన షాకింగ్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో జరిగింది (Crime News).


రామాంతపూర్‌లో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి బీహార్‌కు చెందిన కమర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధిత కుటుంబానికి సమీపంలోనే కమర్ కూడా నివసిస్తున్నాడు. కమర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది.


బాలుడిపై ముళ్లపొదల్లో లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి కమర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి

సోదరి వరసయ్యే బాలికపై అత్యాచారం.. రాఖీ కట్టిన కొన్ని గంటలకే దారుణం

ట్రంప్ అతి పెద్ద క్రిమినల్.. గ్రోక్ చాట్‌బాట్ సంచలన స్టేట్‌మెంట్

For More National News and Telugu News

Updated Date - Aug 16 , 2025 | 08:18 AM