Hyderabad: తూంకుంటలో.. చైన్‌స్నాచింగ్
ABN , Publish Date - Nov 18 , 2025 | 08:00 AM
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది.
- మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసు చోరీ
హైదరాబాద్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట(Shamirpet) మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది. బాధితురాలు, స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంటకు చెందిన మల్కారం జమున(45) ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది.

సోమవారం ఉదయం ఆమె జ్వరంతో బాధపడుతుండగా.. తూంకుంట(Tunkunta)లోని ఆస్పత్రికెళ్లి వైద్య సర్టిఫికెట్ తీసుకుని పాఠశాలలో సమర్పించడానికి బయల్దేరింది. కొద్ది దూరంలోనే కైజన్ పాత జిమ్ము సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఉదయం 11 గంటల సమయంలో వెనుక వైపు నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలో ఉన్న దాదాపు 4 తులాల బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. గొలుసు లాక్కొనే క్రమంలో బాధితురాలు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.

బాధితురాలు జమున గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. బైక్ పై వచ్చిన ఇద్దరు మాస్కులు ధరించి ఉన్నారు. కాగా, ఈ చైన్ స్నాచింగ్ ఆ రోడ్డు వద్ద ఉన్న మెడికల్ షాప్ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. విషయం తెలుసుకున్న శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News