Share News

Hyderabad: ఒంటిపై వెండి ఆభరణాల కోసం.. వృద్ధుడి హత్య

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:37 AM

ఒంటిపై ఉన్న వెండి ఆభరణాల కోసం వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ విష్ణునగర్‌ బస్తీలో సేవ్యానాయక్‌ (70), భార్య సుశీల నివాసముంటున్నారు.

Hyderabad: ఒంటిపై వెండి ఆభరణాల కోసం.. వృద్ధుడి హత్య

- గొంతు నులిమి చంపేసినట్లు అనుమానాలు

- నిర్మాణంలో ఉన్న ఇంటి ఆవరణలోనే మృతి

సైదాబాద్‌(హైదరాబాద్): ఒంటిపై ఉన్న వెండి ఆభరణాల కోసం వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌(Saidabad Police Station) పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ విష్ణునగర్‌ బస్తీలో సేవ్యానాయక్‌ (70), భార్య సుశీల నివాసముంటున్నారు. సేవ్యానాయక్‌ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారు అద్దెకుంటున్న ఇంటికి సమీపంలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇంటి ఆవరణలో ఆదివారం రాత్రి ఒంటరిగా నిద్రించాడు. తెల్లవారుజామున నిద్ర నుంచి లేవకపోవడంతో స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.


city1.3.jpg

తొలుత సహజ మరణంగా భావించారు. కానీ మృతుడి చేయి, కాళ్లకు వెండి కడియాలు, మొలతాడు కనిపించకపోవడంతో అనుమానాలకు దారితీసింది. మెడ నులిమినట్లు గాయాలు ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్‌లు రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. సైదాబాద్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 06:37 AM