Share News

Hyderabad: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

ABN , Publish Date - May 27 , 2025 | 10:04 AM

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఈ తరహ మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.... రోజుకొక ఐడియాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

Hyderabad: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

- టెలిగ్రామ్‌ వేదికగా సైబర్‌ మోసాలు

- అధిక డబ్బు సంపాదన ఆలోచనున్న వారే లక్ష్యం

- పార్ట్‌టైమ్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట గాలం

- మంచి లాభాలంటూ వంచిస్తున్న కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) పరిధిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో సైబర్‌ నేరాలపై పదుల సంఖ్యలోనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఒక వైపు వాట్సాప్‌ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతుంటే ఇప్పుడు టెలిగ్రామ్‌ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మోసాలను చివరకు ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రాడ్‌గా మార్చుకుంటున్నారు. సూత్రధారులు కొందరు దేశ, విదేశాలకు చెందిన వారు ఉంటున్నారని పోలీసుల విచారణలో గుర్తిస్తున్నారు.


తక్కువ మొత్తం మోసపోయిన ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని, లక్షల్లో డబ్బులు పొగొట్టుకున్న వారే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు పేర్కొంటున్నారు. టెలిగ్రామ్‌లో సులువుగా చేరేందుకు అవకాశాలు ఉండటం, ఇతరులను ఈజీగా కాంటాక్టు అయ్యేందుకు అవకాశాలుండటంతో ఎక్కువగా వల వేస్తున్నారు. ఎవరినైనా గ్రూప్‌లో చేర్చుకునేందుకు అవకాశం ఉండటం కూడా మోసాలకు కారణం. ప్రస్తుతం ట్రై పోలీస్‌ కమిషనరేట్లలో నమోదవుతున్న ఆర్థికపరమైన సైబర్‌ నేరాల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి.


ఈ ఘటనలు నిదర్శనం

ఫ నగరానికి చెందిన మహిళను సైబర్‌ నేరగాడు టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పరిచయమై ఇంట్లో నుంచే పార్ట్‌ జాబ్‌ చేయవచ్చని నమ్మించారు. తాను ఆన్‌లైన్‌లో పంపించే లింకులను క్లిక్‌ చేసి టాస్క్‌లను పూర్తి చేయాలన్నాడు. ఇందులో చేరడానికి మొదట కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. కొంత నగదు కూడా తీసుకున్నాడు. అతను చెప్పినట్లుగా లింకులను ఓపెన్‌ చేసి వీడియోలను చూసి లైక్‌లను, రివ్యూలను రాసింది. దీంతో ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. ఇలా కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మబలికారు. చివరిగా రూ.8.75 లక్షలను వసూలు చేశారు. ఆ తర్వాత నుంచి కేటుగాడు ఆ గ్రూపు నుంచి వైదొలగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


city5.2.jpg

- నగరానికి చెందిన ఓ వ్యక్తికి టెలిగ్రామ్‌ గ్రూప్‌ ద్వారా పార్ట్‌టైం జాబ్‌ పేరుతో చేరి రూ.2.38 లక్షలను పొగొట్టుకున్నారు. తద్వారా పరిచయమైన సైబర్‌ నేరగాళ్లు మొదట చిన్న చిన్న టాస్క్‌లను ఇచ్చి, వాటికి డబ్బులు చెల్లిస్తూ నమ్మించారు. ఎక్కువ లాభాలు కావాలంటే అధిక మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని సూచించారు. దీన్ని నమ్మి ఆ వ్యక్తి వారు చెప్పినట్లుగా రూ.2.38లక్షలను కేటుగాళ్లకు పంపించారు. ఆ తర్వాత నుంచి అతడికి అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు.



ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest Telangana News and National News

Updated Date - May 27 , 2025 | 10:04 AM