Hyderabad: బీజేపీ నేతపై కేసునమోదు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:09 AM
భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చిన బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ ప్రగతినగర్‌లో నివసిస్తున్న మెతుకుపల్లి రవీందర్‌రెడ్డి కుమారుడు రిత్విక్‌రెడ్డికి, ఎల్‌బీనగర్‌కు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కుమార్తె ఆకాంక్షరెడ్డితో వివాహం జరిగింది.
హైదరాబాద్: భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చిన బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy)పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్(Ramanthapur) ప్రగతినగర్‌లో నివసిస్తున్న మెతుకుపల్లి రవీందర్‌రెడ్డి కుమారుడు రిత్విక్‌రెడ్డికి, ఎల్‌బీనగర్‌కు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కుమార్తె ఆకాంక్షరెడ్డితో వివాహం జరిగింది. కొద్ది రోజులుగా రిత్విక్‌రెడ్డి, ఆకాంక్షరెడ్డి మధ్య విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు. భార్యాభర్తల వివాదంపై చర్చించేందుకు ఆకాంక్షరెడ్డి తల్లిదండ్రులు,

బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) మరికొందరు రామంతాపూర్ ప్రగతినగర్‌లోని రిత్విక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. మాట్లాడుకుంటుండగా వివాదం నెలకొంది. సుమారు 100 మందితో వెళ్లిన ఆకాంక్షరెడ్డి తల్లిదండ్రులు, బందువులు, సామ రంగారెడ్డి తమపై దాడి చేశారని రిత్విక్‌రెడ్డి తండ్రి రవీందర్‌రెడ్డి ఈనెల 23న ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమను బెదిరించి రూ.2.5 కోట్లకు చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News