Share News

AP News: అయ్యోతల్లీ.. ఎంత కష్టం వచ్చిందమ్మా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:02 PM

రోటరీపురం సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థిని కె. ధనలక్ష్మి(21) ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్‌ గదిలో మంగళవారం ఉరి వేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పెనుకొండ పట్టణంలోని ఒగ్గప్ప కుంట కాలనీకి చెందిన నాగరాజు కూతురు ధనలక్ష్మి.

AP News: అయ్యోతల్లీ.. ఎంత కష్టం వచ్చిందమ్మా.. ఏం జరిగిందంటే..

- బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

- హాస్టల్‌ గదిలో చున్నీతో ఉరి

బుక్కరాయసముద్రం(అనంతపురం): రోటరీపురం సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థిని కె. ధనలక్ష్మి(21) ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్‌ గదిలో మంగళవారం ఉరి వేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పెనుకొండ పట్టణంలోని ఒగ్గప్ప కుంట కాలనీకి చెందిన నాగరాజు కూతురు ధనలక్ష్మి. సీఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతోంది. కాలేజీ ఎన్‌సీసీ శిక్షణలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాల్గొంది.


సాయంత్రం నాలుగన్నర గంటలకు హస్టల్‌ గదికి వెళ్లి.. చున్నితో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆ సమయంలో సహ విద్యార్థినులు స్నాక్స్‌ కోసం వెళ్లారు. వారు తిరిగి వచ్చి గది తలుపులు తట్టినా ధనలక్ష్మి స్పందించలేదు. దీంతో కాలేజీ సిబ్బందిని పిలిపించి, తలుపులను బద్ధలుకొట్టారు. అప్పటికే ధనలక్ష్మి మృతి చెందింది. సీఐ పుల్లన్న, ఎస్‌ఐ రాంప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళాశాల సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. గదిలో సూసైడ్‌ నోట్‌ ఉందేమోనని పరిశీలించారు. ధనలక్ష్మి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‏(Cellphone, laptop)ను స్వాధీనం చేసుకున్నారు.


nani6.3.jpg

కాల్‌డేటాను సేకరించారు. సెల్‌ఫోన్‌ లాక్‌ అయిందని, సాంకేతిక నిపుణల చేత ఓపెన్‌ చేయించి, వివరాలు సేకరిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడికి చేరుకున్న ధనలక్ష్మి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం కాలేజీ హాస్టల్‌ గదికి వెళ్లి పరిశీలించారు. తన కూతురు మృతికి కారణం ఏమిటో తెలియదని, ఈనెల 13 వరకూ ఇంటి వద్ద ఉండి, కాలేజీకి వచ్చిందని విద్యార్థిని తండ్రి నాగరాజు పోలీసులతో అన్నారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

సిందూర్‌ తో మసూద్‌ కుటుంబం చిన్నాభిన్నం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 01:02 PM