Share News

Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయింది బాస్.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 14 , 2025 | 09:09 AM

మన హైదరాబాద్ బాగా డవలప్ అయింది బాస్ అని ఓ సినిమాలో ఉన్న డైలాడ్ మాదిరిగా ఇప్పటికే ఆయా రంగాల్లో దూసుకెళ్లిన నగరం.. చివరకు అసభ్య కార్యక్రమాలకు కూడా అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. బంగ్లాదేశ్ దేశానికి చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచార గృహాల్లోకి పంపుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయింది బాస్.. ఏం జరిగిందంటే..

- బంగ్లా యువతులతో వ్యభిచార గృహాలు

హైదరాబాద్‌: కేవలం ఐదారువేల రూపాయల కమీషన్‌ తీసుకుని పదుల సంఖ్యలో బంగ్లాదేశ్‌(Bangladesh) యువతులను కొందరు బ్రోకర్లు దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా మన దేశంలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లా యువతులను వ్యభిచార గృహాల్లోకి పంపుతున్నారు హైదరాబాదీ ఏజెంట్లు. ఇటీవల పోలీసులు ఛత్రినాక, పహాడిషరీఫ్‏(Chatrinaka, Pahad Sharif)లో రెండు వ్యభిచారగృహాలపై దాడి చేసి చాలామంది యువతులను విడిపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..


city5.2.jpg

వీరంతా బంగ్లాదేశ్‌ యువతులు కావడంతో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఇక్కడ నమోదైన రెండు కేసులను ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) బృందాలు కూడా రంగంలో దిగాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని బంగ్లాదేశ్‌ యువతులను రప్పించి వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడి కావడంతో ఈడీ అధికారులు మనీ రూటింగ్‌ పై దృష్టి సారించారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఏజెంట్‌ రుహుల్‌ అమీన్‌ దాలి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అతడి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ వాలట్‌లో ఉన్న రూ. 1.90 లక్షలను సీజ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 10:12 AM