Share News

Hyderabad: మీ నాన్న ఆటో పంపించాడంటూ.. బాలిక కిడ్నాప్‏నకు యత్నం

ABN , Publish Date - Oct 16 , 2025 | 08:55 AM

‘మీ నాన్న ఆటో పంపించాడు’ అని మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌ను మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన బాలిక(11) చార్‌కమాన్‌ ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

Hyderabad: మీ నాన్న ఆటో పంపించాడంటూ.. బాలిక కిడ్నాప్‏నకు యత్నం

- అసభ్యంగా ప్రవర్తించడంతో కిందకు దూకేసిన చిన్నారి

- డ్రైవర్‌ అరెస్ట్‌.. పోక్సో కేసు నమోదు

హైదరాబాద్: ‘మీ నాన్న ఆటో పంపించాడు’ అని మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌ను మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌షాహి(Sultanshahi) ప్రాంతానికి చెందిన బాలిక(11) చార్‌కమాన్‌ ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తోంది. మార్గమధ్యంలో సయ్యద్‌ షబ్బీర్‌ అలీ అనే ఆటోడ్రైవర్‌ ఆమెను అడ్డగించాడు.


మీ నాన్న ఆటో పంపించాడని మాయమాటలు చెప్పి ఎక్కించుకున్నాడు. అతడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఇంటికి తీసుకెళ్లకుండా మలక్‌పేటవైపు తీసుకెళ్తున్నాడు. సిగ్నల్‌ వద్ద ఆటో ఆగగానే బాలిక కేకలు వేస్తూ కిందకు దూకేసింది. స్థానికులు షబ్బీర్‌ అలీని పట్టుకొని మలక్‌పేట పోలీసులకు అప్పగించగా వారు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌(Meerpet Police Station)కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 08:55 AM