Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:58 PM
దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.
- అనారోగ్యంతో రిటైర్డు వీఆర్‌ఏ మృతి.. షాక్‌తో భార్య..
తాడిమర్రి(అనంతపురం): దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురం(Ananthapuram)లో చికిత్స పొందుతుండేవాడు. ఆయనకు తోడుగా భార్యలింగమ్మ(80)అక్కడే ఉండేది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో నాగన్న మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న భార్య లింగమ్మ షాక్‌తో స్పృహ కోల్పోయింది. పరీక్షించిన డాక్టర్లు లింగమ్మ పరిస్థితి సీరియస్ గా ఉందని బెంగళూరు(Bengaluru)కు తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. దీంతో కొందరు నాగన్న శవాన్ని తాడిమర్రికి తీసుకురాగా మరికొంతమంది లింగమ్మను తీసుకుని బెంగళూరుకు వెళ్లారు. సాయంత్రం 6గంటలకు నాగన్న అంతక్రియలు పూర్తిచేశారు. లింగ్మను బెంగళూరులో ఓప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ 6:30గంటలకు ఆమె మృతి చెందారు. నాగన్న, లింగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News