Anantapur: సెల్‌ఫోన్ రిపేరు కోసం వెళ్లి..
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:08 AM
మండలంలోని సిద్ధనగారిపల్లి సమీపంలో మంగళవారం రాత్రి ఆటో బోల్తాపడి పీసీరేవు గ్రామానికి చెందిన విద్యార్థి నందకిషోర్(14) మృతి చెందినట్లు ముదిగుబ్బ పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ రిపేరీ కోసం నందకిషోర్ మరికొందరితో కలిసి ఆటోలో ముదిగుబ్బకు వచ్చాడు.
- ఆటో బోల్తాపడి విద్యార్థి మృతి
ముదిగుబ్బ(అనంతపురం): మండలంలోని సిద్ధనగారిపల్లి సమీపంలో మంగళవారం రాత్రి ఆటో బోల్తాపడి పీసీరేవు గ్రామానికి చెందిన విద్యార్థి నందకిషోర్(14) మృతి చెందినట్లు ముదిగుబ్బ పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ రిపేరీ కోసం నందకిషోర్ మరికొందరితో కలిసి ఆటోలో ముదిగుబ్బకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా సిద్ధనగారిపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో తీవ్రంగా గాయపడిన నందకిషోర్‌ను స్థానికులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆటో మిగిలిన ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడు ఉప్పలపాడు బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి
Read Latest Telangana News and National News