Secunderabad: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి పట్టివేత..
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:34 AM
రైల్వే స్టేషన్‌లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్ రైల్వే, సికింద్రాబాద్ ఆర్పీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలను వెల్లడించారు.
- పాడేరు టు మహారాష్ట్రకు సరఫరా
సికింద్రాబాద్: రైల్వే స్టేషన్‌లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్ రైల్వే, సికింద్రాబాద్ ఆర్పీఎస్(Secunderabad RPS) పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు(Paderu) ప్రాంతానికి చెందిన బొబ్బరాల లక్ష్మి(40) అదే ప్రాంతానికి చెందిన బోన్యా ఇద్దరు బాగా పరిచయస్తులు.

లక్ష్మి ఆర్థిక ఇబ్బందులు కారణంగా బోన్యా తన వద్ద వ్యాపారం ఉందని తాను ఇచ్చే గంజాయిని మహరాష్ట్రలో ఒకరికి అప్పగిస్తే చాలు రానుపోను ఖర్చులతో పాటు మూడువేల రూపాయలు ఇస్తానని చెప్పడంతో సరేనని ఒప్పుకుంది.
గతంలో లక్ష్మిపై విశాఖపట్నంలోని శృంగవరపుకోట పోలీస్‌స్టేషన్(Srungavarapukot Police Station)లో రెండుసార్లు పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించింది. బోన్యా ఆమెకు నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్న బ్యాగును అప్పగించి విశాఖపట్నంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కించాడు.
సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రోజు తరహాలోనే జీఆర్‌పీ ఎస్సై రమే్‌షతో పాటు కానిస్టేబుళ్లు సత్యనారాయణ, విజయమ్మ, ఆశీర్వాదం, రజిత, తులసీ నాయుడు, భవానీ శంకర్‌లతో పాటు సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ సీఐ సరస్వత్, ఎస్సై సుబ్బారావులు కలిసి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా రిజర్వేషన్ బోగిలో ఉన్న లక్ష్మి వద్దకు చేరుకున్న పోలీసులు ఆమె బ్యాగును సోదా చేయగా 8 కిలోల గంజాయి ఉన్నట్లు తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా బోన్యా అనే వ్యక్తి సరుకు ఇచ్చాడని విచారణలో ఒప్పుకుంది. ప్రస్తుతం బోన్యా పరారీలో ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. నిందితురాలి నుంచి సరుకు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News