Petrol Under GST: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందా.. సీబీఐసీ ఛైర్మన్ క్లారిటీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:14 PM
పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ వర్తింపజేసే అంశం దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు చర్చకు వచ్చింది. వినియోగదారులపై భారం తగ్గుతుందనే ఆశతో అధికారులతోపాటు అనేక మంది చూస్తున్నారు. తాజాగా CBIC ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) లోకి తీసుకొచ్చే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ, ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ దీనిపై కొత్త అప్‌డేట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ అగర్వాల్ చెప్పిన ప్రకారం, పెట్రోల్, డీజిల్‌పై ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT, రాష్ట్ర పన్ను) విధిస్తున్నారు.
ఈ రెండు పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే, ఈ ఇంధనాలను GST లోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అవకాశం లేదన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి ఏమన్నారు?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయంపై ప్రస్తావించారు. మేము చట్టపరంగా పెట్రోల్, డీజిల్‌ను GST లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ఈ నిర్ణయానికి రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. అంటే, బంతి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కోర్టులో ఉంది. రాష్ట్రాలు ఒప్పుకుంటే, GST కౌన్సిల్‌లో ట్యాక్స్ రేటు గురించి చర్చించి, చట్టం చేయవచ్చు.
GST వచ్చినప్పటి నుంచి ఈ చర్చ ఎందుకు?
2017లో GST అమలు చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని దీని పరిధిలోకి తీసుకొచ్చే ప్రసక్తే లేదన్నారు. ఎందుకంటే, ఈ ఉత్పత్తులపై వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, VAT ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం వస్తోంది.
కొన్ని రాష్ట్రాలకు అయితే ఈ పన్నులు వాళ్ల మొత్తం ట్యాక్స్ ఆదాయంలో 25-30% వరకు ఉంటాయి. అందుకే, రాష్ట్రాలు ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. పైగా, ఈ పన్నుల ద్వారా ధరలను నియంత్రించడం, వినియోగాన్ని ప్రభావితం చేయడం వంటి అధికారం కూడా రాష్ట్రాలకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి