Fixed Deposit: ఎఫ్‌డీ వేసే మందు ఒక్క సారి ఆలోచించండి..
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:20 PM
మనం నగదు ఎంతకాలం పెడతారనే దానిపై లాభం నిర్ణయించబడుతుంది. స్వల్ప కాలానికి పెట్టుబడి పెడితే.. మీకు అవసరమైనప్పుడు నగదు మీ చేతికి వస్తుంది. కానీ లాభం మాత్రం కొంచెం స్వల్పంగా వస్తుంది.
దేశంలో చాలా మంది నగదును ఎఫ్‌డీ రూపంలో బ్యాంక్, పోస్టాఫీసుల్లో జమ చేస్తారు. ఇలా చేసే ముందు పక్కా ప్రణాళిక ఉండాలని మదుపుదారులకు ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలను సైతం వారు సూచిస్తున్నారు.
మనం నగదు ఎంతకాలం పెడతారనే దానిపై లాభం నిర్ణయించబడుతుంది. స్వల్ప కాలానికి పెట్టుబడి పెడితే.. మీకు అవసరమైనప్పుడు నగదు మీ చేతికి వస్తుంది. కానీ లాభం మాత్రం కొంచెం స్వల్పంగా వస్తుంది. అదే అధిక కాలం ఎఫ్‌డీ చేస్తే.. అధికంగా వడ్డీ వస్తుంది. మీకు తక్షణ అవసరాలకు లాభం, నగదు రెండూ అవసరమైతే.. స్వల్ప, దీర్ఘ కాలికంగా రెండింటిలోనూ పెట్టుబడి పెట్టడం తెలివైన పని అని.. దీనినే బ్యాలెన్సింగ్ అంటారని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఒకే ఎఫ్‌డీలో పెట్టకండి.. ఎందుకంటే..
మీ వద్ద ఉన్న నగదునంతా ఒకే ఎఫ్‌డీలో పెట్టవద్దని సూచిస్తున్నారు. దీనిని పలు ఎఫ్‌డీలుగా విభజించుకొని.. వేర్వేరు సమయాల్లో మెచ్యూరిటీ అయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఏడాది ఒక ఎఫ్‌డీని మీరు పొందుతారు. ఒక వేళ.. వడ్డి రేట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుటికీ.. మీకు టెన్షన్ అనేది ఉండదు.
నగదు డిపాజిట్ చేసే ముందు..
నగదు డిపాజిట్ చేసే ముందు.. ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తుందో తనిఖీ చేయాలి. ప్రభుత్వ బ్యాంకులు ఒకలా వడ్డి ఇస్తుంటే.. ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. 0.5 శాతం పెరుగుదల అనేది చాలా స్పల్పంగా అనిపించినప్పటికి.. దీర్ఘకాలికంగా నగదు ఎఫ్‌డీ చేస్తే.. అధిక మొత్తం చేతికి అందుతుంది. ఇలా నాలుగైదు బ్యాంకుల్లో తనిఖీ చేసి.. ఆ తర్వాత ఎఫ్‌డీ చేస్తే మంచి మొత్తంలో నగదు అందుకుంటారు.
వడ్డీ మీద వడ్డీ..
ఎఫ్‌డీ పూర్తయిన తర్వాత వచ్చిన వడ్డీ నగదును అసలు ఖర్చు చేయకండి. దానిని తిరిగి ప్రిన్సిపల్‌తో కలిపి కొత్త ఎఫ్‌డీ చేయండి. దీనిని కాంపౌండింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల మరికొన్ని సంవత్సరాల్లో మీ నగదు రెట్టింపు అవుతుంది. నగదు పెంచుకోనేందుకు ఇది ఒక ఉత్తమమైన మార్గం.
ఐదేళ్ల ప్రణాళికతో పన్ను ఆదా..
అధికంగా ఆదాయపు పన్ను కట్టాల్సి వస్తుందని ఆందోళన చెందుతుంటే.. 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) తీసుకోవాలి. దీనికి సెక్షన్ 80 సీ నుంచి మినహాయింపు ఉంది. నగదు సురక్షితంగా ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించే పన్ను కూడా ఆదా అవుతుంది.
రిస్క్ వద్దు.. భద్రత ముఖ్యం..
నగదంతా ఒకే చోట ఉంచవద్దు. వేర్వేరు బ్యాంకుల్లో నగదు ఉంచితే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి బ్యాంకు డిపాజిట్‌కు రూ. 5 లక్షల వరకు బీమా కవరేజ్ ఉంటుంది. బ్యాంకుకు ఏదైనా జరిగే మీ నగదు సురక్షితంగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. రికార్డులు బ్రేక్
SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!
For More Business News And Telugu News