SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:44 AM
SBI మ్యూచువల్ ఫండ్ భారత్‌లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్‌తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 24: భారత్ అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) అయిన SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (SBI మ్యూచువల్ ఫండ్) IPO రాబోతుంది. దీనికి సంబంధించి SBI ఛైర్మన్ సీఎస్ శెట్టి కీలక ప్రకటన చేశారు. రాబోయే 12 నెలల్లో (2026లో) ఈ IPOను పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని IPOలు లేదా స్టేక్ సేల్స్‌పై ఆసక్తి లేదని, రాబోయే 5 ఏళ్లకు SBIకి కొత్త క్యాపిటల్ అవసరం లేదని శెట్టి చెప్పారు.
IPO వివరాలు:
స్టేక్ సేల్:
ప్రమోటర్లు (SBI + Amundi) కలిపి 10% వాటా విక్రయిస్తారు.
SBI: 6.3% (సుమారు 3.2 కోట్ల షేర్లు).
Amundi: 3.7%.
మర్చంట్ బ్యాంకర్ల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది SBI సబ్సిడరీల్లో మూడో లిస్టింగ్ (SBI కార్డ్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత). గతంలో బజాజ్ హౌసింగ్, టాటా క్యాపిటల్ వంటి పెద్ద IPOలు భారీ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చాయి. SBI మ్యూచువల్ ఫండ్ బ్రాండ్ స్ట్రెంత్, మార్కెట్ లీడర్‌షిప్‌తో ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో