Gold, Silver Rates on Dec 24: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. రికార్డులు బ్రేక్
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:23 AM
బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కొత్త రికార్డులు నెలకొల్పాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు తగ్గేదేలేదంటున్నాయి. రోజుకో ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేస్తూ దడ పుట్టిస్తున్నాయి. తాజాగా బంగారం వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 11.00 గంటల సమయంలో 24 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 మేర పెరిగి రూ.1,38,930కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.350 మేర పెరిగి రూ.1,27,350కు చేరింది (Gold Silver Rates on Dec 24).
దూకుడులో బంగారాన్ని మించిపోయిన వెండి ధర నిన్నటితో పోలిస్తే నేడు ఏకంగా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,33,000 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ వెండి స్పాట్ ధరలు 72 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. నిన్నటితో పోలిస్తే ఇది 1.10 శాతం అధికం. ఈ వారంలో ఇప్పటివరకూ వెండి రేట్స్ 9.00 శాతం మేర పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి పెరిగిన డిమాండ్, భౌగోళికరాజకీయ అనిశ్చితులు వెరసి వెండికి భారీగా డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వివిధ నగరాల్లో పసిడి ధరలు
చెన్నై: ₹1,39,640; ₹1,28,000; ₹1,06,750
ముంబై: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
న్యూఢిల్లీ: ₹1,39,080; ₹1,27,500; ₹1,04,350
కోల్‌కతా: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
బెంగళూరు: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
హైదరాబాద్: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
విజయవాడ: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
కేరళ: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
పుణె: ₹1,38,930; ₹1,27,350; ₹1,04,200
వడోదరా: ₹1,38,980; ₹1,27,400; ₹1,04,250
అహ్మదాబాద్: ₹1,38,980; ₹1,27,400; ₹1,04,250
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
జోస్ అలుక్కాస్ ప్రచారకర్తగా దుల్కర్ సల్మాన్
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి