Stock Markets Thursday Closing: గురువారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - May 08 , 2025 | 03:55 PM
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ భారత మార్కెట్లు చాలా ధృడంగా కదిలాయి. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ..

ముంబై: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ (గురువారం) నష్టాలతో ముగిశాయి. అయితే, భారత స్టాక్ మార్కెట్లు చాలా స్థిరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. నిన్న ఆపరేషన్ సిందూర్ మొదలై పాకిస్థాన్ మీద భారత్ దాడి చేసినప్పటికీ భారత మార్కెట్లు ఏమాత్రం జంకలేదు. అలాగే ఇవాళ కూడా పొరుగుదేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారత మార్కెట్లు మొదటి అర్థభాగం వరకూ చాలా స్థిరంగా కొనసాగాయి. అయితే, మార్కెట్ క్లోజింగ్ కు దాదాపు గంట సమయం ఉందనగా మార్కెట్లలో ఒత్తిడి ఏర్పడింది. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో చివర్లో మార్కెట్లు డీలా పడ్డాయి.
ఈ నేపథ్యంలో నిఫ్టీ 140.60 పాయింట్లు కోల్పోయి 24,273.80 వద్ద ముగియగా, సెన్సెక్స్ 411.97 పాయింట్లు క్షీణించి 80,334.81 దగ్గర ముగిసింది. నిఫ్టీలో అతిపెద్ద నష్టాలు చవిచూసిన వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఎం అండ్ ఎం, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. లాభపడిన వాటిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఐటీ, మీడియా మినహా అన్ని ఇతర రంగాల సూచీలు మెటల్, ఆయిల్ & గ్యాస్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ 1-2 శాతం నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పడిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News