Share News

Business Idea : ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. కష్టపడకుండానే నెలకు రూ.70 వేలు..

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:50 PM

Low Investment Business Idea : తక్కువ పెట్టుబడి, ఖచ్చితమైన ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా కోసం ఎదురుచూస్తున్నారా.. ఐతే ఇది మీకోసమే.. ఈ వ్యాపారంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. నష్టం అనే మాటే ఉండదు. ఏ కష్టమూ చేయాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చునే కష్టపడకుండా నెల నెలా రూ.70 వేలు మీ ఖాతాలోకి వచ్చిపడతాయి. కావలిస్తే ఉద్యోగం చేసుకుంటూ అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు.

Business Idea : ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. కష్టపడకుండానే నెలకు రూ.70 వేలు..
How to get SBI ATM Franchise

Low Investment Business Idea : జాబ్ కోసం కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయారా ? ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందే మార్గాలేంటి అని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఉద్యోగం వదిలి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? ఐతే ఈ ఐడియా మీకోసమే.. చదువుతో పనిలేకుండా ఎలాంటి వారైనా ఈ బిజినెస్ చేయవచ్చు. జస్ట్ ఒకే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. నష్టపోతామనే చింతే లేదు. ఏ కష్టమూ చేయకుండా దర్జాగా ఇంట్లో కూర్చునే ప్రతి నెలా రూ.70లు సంపాదించవచ్చు. మీ పనులు మానుకోకుండానే ఈ పని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అదెలా అనుకుంటున్నారా ?


మనదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సొంతంగా ఏటీఎమ్ ఏర్పాటు చేసుకోదు. ఈ బాధ్యతలను ప్రైవేటు కంపెనీల చేతికి అప్పగిస్తుంది. ముఖ్యంగా ఇండియా వన్ ఏటీఎం (India One ATM), ముత్తూట్ ఏటీఎం (Muthoot ATM), ఇండిక్యాష్ (Tata Indicash) వంటి సంస్థలు SBI ATM ఫ్రాంచైజీ కాంట్రాక్టులు నడిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ ఫ్రాంచైజీల ఏర్పాటుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.


SBI-Atm-Franchise-Business.jpg

రోజుకు కనీసం రూ.2వేల ఆదాయం..

ఒక్కసారి ఈ ఫ్రాంచైజీ దక్కితే ఏటీఎమ్ నుంచి క్యాష్ డ్రా చేసుకున్న ప్రతిసారీ రూ.8 కమిషన్ వస్తుంది. ఇదే కాక మినీ స్టేట్‌మెంట్ జనరేటింగ్, బ్యాంక్ బ్యాలన్స్ చెకింగ్ లాంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లపై రూ.2 కమిషన్ లభిస్తుంది. మొత్తంగా రోజుకు 300 ట్రాన్సాక్షన్లకు పరిమితి ఉంటుంది. అంటే మీకు ఒక రోజులో కచ్చితంగా రూ.2వేల ఆదాయం వస్తుంది. ఈ ప్రకారం మీరు ప్రతినెలా సుమారు రూ.70 వేలు పైనే సంపాదిస్తారు.


మరి, SBI ATM ఫ్రాంచైజీ ఏర్పాటు చేసేందుకు ఇలా చేయండి..

దరఖాస్తు : ఆసక్తి ఉన్నవారు ముత్తూట్ ఏటీఎం www.muthootatm.com, ఇండియా వన్ ఏటీఎం india1atm.in/rent-your-space, టాటా ఇండిక్యాష్ వెబ్‌సైట్ www.indicash.co.in వంటి వెబ్‌సైట్లలో ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంఛైజీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

పెట్టుబడి : మీరు కనీసం రూ. 5-6 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్, రూ. 3 లక్షల వర్కింగ్ క్యాపిటల్, ఇతర ఖర్చులు ఉంటాయి.

  • ATM ఇన్‌స్టాలేషన్ ఖర్చులు : ₹2-3 లక్షలు

  • ఫ్రాంచైజీ రుసుము : ₹1-2 లక్షలు

  • సెక్యూరిటీ డిపాజిట్ : ₹2 లక్షలు

  • వర్కింగ్ క్యాపిటల్ : ₹50,000-1 లక్ష

  • విద్యుత్, నిర్వహణ : నెలకు ₹10,000-15,000


SBI ATM ఫ్రాంచైజీ పొందేందుకు పాటించాల్సిన షరతులు..

  • ATM ఏర్పాటుకు 50-80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

  • 100 మీటర్ల లోపు వేరే బ్యాంకు ATM ఉండకూడదు.

  • 24 గంటల విద్యుత్ సరఫరా 1 కిలోవాట్ పవర్ కనెక్షన్ తప్పనిసరి.

  • ప్రజలు సులువుగా గుర్తించగలిగే ప్రాంతం అయి ఉండాలి.

  • ఏటీఎం గదికి కాంక్రీట్ సీలింగ్, వీ శాట్ ఇన్‌స్టాల్ కోసం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరి.

అవసరమయ్యే డాక్యుమెంట్లు : ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్‌, పాన్ కార్డ్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పాస్‌బుక్, కరెంట్ బిల్లు, ఫోటోలు, జీఎస్టీ నంబర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి.

లాభాలు ఇలా :

  • ప్రతి నగదు లావాదేవీకి రూ. 8

  • నగదు రహిత లావాదేవీకి రూ. 2

  • నెలవారీ ఆదాయం రూ. 45,000-రూ.90,000 మధ్య ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్

OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..

Stock Market: మోదీ, ట్రంప్ భేటీ వేళ.. స్టాక్ మార్కెట్లు తీరు ఎలా ఉందంటే..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 12:50 PM