Air India Offer: వీరికి మరింత చౌకగా ఎయిర్ ఇండియా ప్రయాణం..అదిరే ఆఫర్
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:44 AM
పెద్దవాళ్లు సౌకర్యంగా, చౌకగా ప్రయాణం చేయడానికి ఎయిర్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో కూడా స్పెషల్ డిస్కౌంట్లు, అదనపు లగేజ్ అలవెన్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు.
ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, చౌకగా అనుభవించవచ్చు. దేశీయ ప్రయాణాలకే కాదు, అంతర్జాతీయ విమానాలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అదనపు లగేజ్ అలవెన్స్, డేట్ మార్పుల సదుపాయం లాంటి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా వయసు పెరిగిన తర్వాత ప్రయాణం కొంత కష్టమే అనుకుంటాం, కానీ ఎయిర్ ఇండియా ఈ ఆఫర్లతో మీ ఆలోచనను మార్చుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. ఈ క్రమంలో మీరు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్ చేస్తే బేస్ ఫేర్‌పై 10% డిస్కౌంట్ పొందవచ్చు. ఒకసారి ఉచితంగా డేట్ మార్చుకునే అవకాశం (ఫేర్ డిఫరెన్స్ ఉంటే చెల్లించాలి) ఉంది. అదనంగా 10 కిలోల లగేజ్ లేదా ఒక అదనపు బ్యాగ్ తీసుకెళ్లొచ్చు
లగేజ్ అలవెన్స్ క్లాస్‌ను బట్టి మారుతుంది
ఎకానమీ క్లాస్: 10 కిలోల అదనపు లగేజ్ (మాక్స్ 40 కిలోల వరకు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 23 కిలోల వరకు)
ప్రీమియం ఎకానమీ: 10 కిలోల అదనపు లగేజ్ (మాక్స్ 45 కిలోల వరకు) లేదా 2 బ్యాగ్స్ (23 కిలోల ప్రతీ బ్యాగ్)
బిజినెస్ క్లాస్: 10 కిలోల అదనపు లగేజ్ (మాక్స్ 50 కిలోల వరకు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 32 కిలోల వరకు)
బుకింగ్ సమయంలో UPIPROMO అనే ప్రోమో కోడ్ వాడితే, రూ.2,000 వరకు అదనంగా తగ్గింపు పొందొచ్చు. ఇది UPI పేమెంట్ చేసినవారికే వర్తిస్తుంది
దేశీయ ప్రయాణాల్లో ప్రత్యేక ఆఫర్లు:
దీంతోపాటు దేశీయంగా ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
బేస్ ఫేర్‌పై 25% డిస్కౌంట్
UPI పేమెంట్ చేసేవారికి రూ.200 అదనపు తగ్గింపు (UPIPROMO కోడ్ వాడాలి)
బ్యాగేజ్ అలవెన్స్ – 15 కిలోలు
డేట్ ఛేంజ్, క్యాన్సిలేషన్ నిబంధనలు:
3 రోజుల ముందు డేట్ మార్చుకుంటే ఉచితం
3 రోజులకు ముందుగా క్యాన్సిల్ చేస్తే రూ.2,000, తర్వాత అయితే రూ.3,500
బుకింగ్ ఎలా చేయాలి?
బుకింగ్ చేసేటప్పుడు Senior Citizen అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, యాప్, కాల్ సెంటర్ లేదా ఏదైనా టికెట్ బుకింగ్ ఆఫీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దీనికోసం వయస్సు ప్రూఫ్ (ఫోటో ID) తప్పనిసరి. టికెట్ తీసుకనేటప్పుడు, చెక్-ఇన్ సమయంలో, బోర్డింగ్ సమయంలో చూపించాలి. ID చూపించకపోతే మీరు బోర్డు కావడానికి అనుమతి ఇవ్వకుండా, టికెట్ విలువకు రెట్టింపు చార్జ్‌తో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి