Options Trading: స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అరికట్టే యోచన.. వీక్లీ ఆప్షన్‌లకు 'బై..బై' చెప్పనున్న సెబీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:37 PM
స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్‌ను దశలవారీగా రద్దు చేయాలని SEBI భావిస్తోంది. మొదట్లో వీటిని.. మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, షార్ట్-టర్మ్ హెడ్జింగ్ కోసం తీసుకొచ్చారు. అయితే, వీటిని ఇప్పుడు క్విక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
ముంబై, అక్టోబర్ 14, 2025: స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు సంబంధించి వీక్లీ ఆప్షన్స్‌ను దశలవారీగా రద్దు చేయాలనే విషయాన్ని SEBI పరిశీలిస్తోంది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అరికట్టడానికి డెరివేటివ్స్ మార్కెట్‌లో వీక్లీ ఆప్షన్స్ కాంట్రాక్టులను దశలవారీగా రద్దు చేయాలని చూస్తోంది. ప్రధానంగా మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అరికట్టడానికి, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచడానికి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
మొదట్లో వీక్లీ ఆప్షన్స్‌ను.. మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, షార్ట్-టర్మ్ హెడ్జింగ్ కోసం వీటిని తీసుకొచ్చారు. అయితే, ఇవి ఇప్పుడు పూర్తిగా రిటైల్, ఇంట్రాడే ట్రేడర్లు వీటిని క్విక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజుల్లో మార్కెట్ వోలటాలిటీని పెంచుతున్నాయని, ఇది మార్కెట్ డెప్త్ లేదా స్థిరత్వానికి దోహదపడటం లేదని SEBI అభిప్రాయపడుతోంది.
ఈ క్రమంలో మంత్లీ ఆప్షన్స్.. వీక్లీ ఆప్షన్స్ కంటే మరింత స్థిరమైనవిగా తలుస్తున్నారు. మంత్లీ ఆప్షన్స్.. ఇన్‌స్టిట్యూషనల్ హెడ్జింగ్‌కు అనుకూలంగా భావిస్తున్నారు. దీంతో వాటి ఎక్స్‌పైరీ సైకిల్‌లో మార్పులు, లాంగర్-డ్యూరేషన్ కాంట్రాక్టులను స్ట్రీమ్‌లైన్ చేయాలని కూడా సెబీ ఆలోచిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనకు మార్కెట్ వర్గాలు వ్యతిరేకత చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ తీసేయడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్, లిక్విడిటీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ, కరెన్సీ డెరివేటివ్స్‌లో ఇటీవలి కర్బ్‌ల మాదిరిగానే, దీర్ఘకాలిక ఆరోగ్యకర మార్కెట్ ప్రాధాన్యతగా ముందుకు వెళ్లాలని SEBI భావిస్తోంది.
ఈ మార్పులు మార్కెట్ వోలటాలిటీని తగ్గించి, స్పెక్యులేషన్‌ను డిస్కరేజ్ చేస్తాయని సెబీ గట్టిగా నమ్ముతోంది. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్‌ను ప్రోత్సహిస్తాయని కూడా SEBI ఆశిస్తోంది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేగంగా పెరిగిన నేపథ్యంలో, కొత్తగా తెచ్చే ఈ సంస్కరణలు మార్కెట్ డిసిప్లిన్‌ను బలోపేతం చేస్తాయని సెబీ నమ్ముతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News