PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:30 PM
ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ 20వ విడత ఆగస్టులో పూర్తైంది. ఇప్పుడు రైతులు 21వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు (PM Kisan 21st Installment). ఈ క్రమంలో దీపావళి పండగకు ముందే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు జమ అవుతాయాని తెలుస్తోంది. అయితే ఇది నిజమేనా, 21వ వాయిదా ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ డబ్బు మూడు వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుంది. పంటల సాగు ఖర్చులకు కొంచెం తోడ్పాటుగా ఉంటుంది.
ఇప్పటి వరకు..
ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా 20 వాయిదాలు విడుదలయ్యాయి. ఇటీవల 20వ వాయిదా ఆగస్టు 2, 2025న రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో, ఇప్పుడు అందరి దృష్టి 21వ వాయిదా మీద పడింది. దీపావళి సీజన్ రాబోతుంది కాబట్టి, ఈ పండుగకు ముందే డబ్బు వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. 19వ విడత ఫిబ్రవరి 24, 2025లో విడుదలైంది.
21వ వాయిదా..
ఈ స్కీమ్ రూల్స్ ప్రకారం, ప్రతి నాలుగు నెలలకు ఒక వాయిదా విడుదల అవుతుంది. 20వ వాయిదా ఆగస్టు 2, 2025లో వచ్చింది కాబట్టి, 21వ వాయిదా నవంబర్ లేదా డిసెంబర్ 2025లోపు రావొచ్చని అంటున్నారు. అంటే దీపావళి 2025కి ముందు వస్తుందా లేదా అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రైతులు ఏం చేయాలి?
మీ ఖాతాలో డబ్బు సకాలంలో జమ కావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు, ఆధార్ వివరాలు చెక్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లింక్ అయి ఉన్నాయో లేదో చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే, వాయిదా ఆలస్యం కావచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను (pmkisan.gov.in) చెక్ చేయండి. తాజా అప్‌డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా eKYC పూర్తి చేయకపోతే, త్వరగా చేయండి. ఇది తప్పనిసరి, లేకపోతే మీ ఖాతాలో డబ్బు జమ కాదు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి