Share News

PLI Scheme Deadline: PLI స్కీమ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు.. వీరికి మంచి ఛాన్స్..

ABN , Publish Date - Oct 03 , 2025 | 04:34 PM

దేశ టెక్స్‌టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ కు దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్లు టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

PLI Scheme Deadline: PLI  స్కీమ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు.. వీరికి మంచి ఛాన్స్..
PLI Scheme Deadline

కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్స్ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI Scheme Deadline 2025) స్కీమ్ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 31, 2025 వరకూ పొడిగించింది. ఈ నిర్ణయం శుక్రవారం టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్కీమ్ కు టెక్స్‌టైల్స్ పరిశ్రమ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకునేందుకు అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (https://pli.texmin.gov.in/) డిసెంబర్ 31, 2025 వరకూ అవకాశం ఉంటుంది. దేశీయ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించడమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం.


మరో ఛాన్స్..

ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఈ స్కీమ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమ నుంచి వస్తున్న ఆసక్తిని ప్రోత్సహించడానికి, పెట్టుబడిదారులకు మరో అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

PLI స్కీమ్ టెక్స్‌టైల్ రంగంలో మాన్ మేడ్ ఫైబర్ (MMF) దుస్తులు, MMF ఫ్యాబ్రిక్స్, టెక్స్‌టైల్స్ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఆగస్టు 2025లో ఆహ్వానించిన దరఖాస్తుల్లో భాగంగా ఈ విభాగాల నుంచి అనేక దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ ద్వారా భారతదేశ టెక్స్‌టైల్ రంగంలో పోటీతత్వాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.


భారత టెక్స్‌టైల్ రంగం..

భారత్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతి దేశంగా ఉంది. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. భారత టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా ఉంది. ఇది సహజ ఫైబర్‌లు (పత్తి, పట్టు, ఉన్ని, జనపనార) మాన్-మేడ్ ఫైబర్‌ వంటి ముడి సరుకులపై ఆధారపడి ఉంది. ఫైబర్ నుంచి ఫ్యాబ్రిక్ దుస్తుల వరకు మొత్తం భారతదేశం బలమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.


220కి పైగా దేశాలకు..

2024-25 ఆర్థిక సంవత్సరంలో టెక్స్‌టైల్స్, దుస్తుల ఎగుమతులు 2023-24తో పోలిస్తే సుమారు 5.2% వృద్ధిని సాధించాయి. భారతదేశం ప్రస్తుతం 220కి పైగా దేశాలకు దుస్తులను ఎగుమతి చేస్తోంది. అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కొన్ని మార్కెట్లలో సుంకం అసమానతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో 2030 నాటికి రూ. 9 లక్షల కోట్ల ఎగుమతులను సాధించాలని టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


భారత టెక్స్‌టైల్స్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు

ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు (FTAs): భారతదేశం 15 దేశాలతో FTAలను కుదుర్చుకుంది. ఇటీవల భారత్-యూకే మధ్య సీఈటీఏ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు సుంకం, సుంకేతర అడ్డంకులను తగ్గించడం, విధానాలను సరళీకరించడం ద్వారా భారత ఎగుమతిదారులకు పోటీతత్వాన్ని పెంచుతాయి.

PM MITRA పార్కులు: ఆధునిక, సమీకృత, ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అండ్ అపెరల్ (PM MITRA) పార్కుల స్కీమ్ ప్రారంభించబడింది.

PLI స్కీమ్: MMF ఫాబ్రిక్, MMF దుస్తులు, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో పెద్దఎత్తున ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ రూపొందించబడింది. దీంతోపాటు భారత్ అనేక విషయాల్లో ఈ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 05:14 PM