Share News

ITR Filing Deadline: ఇంకా 11 రోజులే టైం..ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:15 PM

మీ సెలవులకి ప్లాన్ చేసే ముందు ఒక్కసారి ఐటీఆర్ ఫైలింగ్ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే దీని గడువు తేదీ సమీపిస్తోంది. టైంలోపు పక్కాగా ఫైల్ చేస్తే రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ITR Filing Deadline: ఇంకా 11 రోజులే టైం..ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా
ITR Filing Deadline

మీరు ఈ ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేశారా లేదా. ఎందుకంటే ఈ సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు ఇంకా 11 రోజులు మాత్రమే (సెప్టెంబర్ 15 వరకు) ఉంది (ITR Filing Deadline). సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే దీని కోసం సిద్ధమవ్వండి. ఆలస్యం అయితే మాత్రం జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

ఎంత మంది ఫైల్ చేయాలి?

సెప్టెంబర్ 3, 2025 నాటి డేటా ప్రకారం, దాదాపు 3 కోట్ల మంది ట్యాక్స్‌పేయర్లు ఇంకా తమ ఐటీఆర్ ఫైల్ చేయలేదు. గడువు ముగియడానికి ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. సెప్టెంబర్ 15 అనేది ఆడిట్ అవసరం లేని ట్యాక్స్‌పేయర్లకు రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ. ఈ గడువు దాటితే, ఆలస్య రుసుముతో రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది గడువు మళ్లీ పొడిగించే అవకాశం తక్కువగా ఉందని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది.


ఈ ఏడాది ఎంత మంది ఫైల్ చేశారు?

సెప్టెంబర్ 2, 2025 నాటికి, 4.45 కోట్ల మంది పన్ను చెల్లింపు దారులు తమ ఐటీఆర్ ఫైల్ చేశారు. అందులో 4.22 కోట్ల మంది తమ రిటర్న్‌లను ఈ-వెరిఫై చేశారు. కానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు కేవలం 3.04 కోట్ల రిటర్న్‌లను మాత్రమే ప్రాసెస్ చేసింది. అంటే, ఇంకా చాలా రిటర్న్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి.

గత ఏడాదితో పోల్చితే?

గత సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31, 2024. ఆ తేదీ నాటికి 7.41 కోట్ల రిటర్న్‌లు ఫైల్ అయ్యాయి. అందులో 6.17 కోట్లు ఈ-వెరిఫై అయ్యాయి. ఈ ఏడాది గడువు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫైలింగ్ సంఖ్య ఆ స్థాయికి చేరలేదు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది కనీసం 3.06 కోట్ల మంది ఇంకా ఫైల్ చేయాల్సి ఉంది. ట్యాక్స్‌పేయర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నందున, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 03:15 PM