Business Idea : ఇండియాలో టాప్ స్మాల్ బిజినెస్ ఐడియా ఇదే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:28 PM
Business Idea : లోన్ చెల్లించే స్థోమత లేదా ? చేతిలో ఉన్న కొంచెం డబ్బుతోనే చిన్న బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలని కోరుకుంటున్నారా.. అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ఐడియా. పెట్టుబడి కూడా వేలల్లోనే. డబ్బు పోతుందనే భయమూ లేదు. వ్యాపారంలో పెట్టిన డబ్బు రెట్టింపు లాభాలతో తప్పకుండా మీ చేతికి తిరిగొస్తుంది. ఎందుకంటే, ఇండియాలో ఉన్న చిన్న వ్యాపారాల్లో ఇదే టాప్. మరి అదేంటో తెలుసుకోండి.

Business Idea : లోన్ చెల్లించే స్థోమత ఉండదు. కానీ ఇంటి దగ్గరే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనే ఆశ ఉంటుంది. అప్పు చేయకుండా చేతిలో ఉన్న కొంచెం డబ్బుతోనే జీవితంలో చిన్న స్థాయి వ్యాపారవేత్తగా స్థిరపడాలనే కోరిక మీలో ఉందా. మంచి ఆలోచన తెలిస్తే ఎంత కష్టమైనా పడేందుకు మేం సిద్ధం అనే ఆశయం ఉన్నవారి వారికోసమే ఈ బిజినెస్ ఐడియా. పెట్టుబడి కూడా వేలల్లోనే. డబ్బు పోతుందనే భయమూ లేదు. పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు లాభాలతో తప్పకుండా మీ చేతికి తిరిగొస్తుంది. ఎందుకంటే, ఇండియాలో ఉన్న చిన్న వ్యాపారాల్లో ఇదే టాప్. మరి అదెంటో తెలుసుకోండి. బిజినెస్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
దేశంలో చాలా మంది యువత గ్రామాల్లోనే నివసిస్తుంటారు. సాధారణంగా పల్లెటూళ్లలో వ్యవసాయమే ప్రధానంగా జీవించే కుటుంబాలే ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద చదువులు చదివినా ఉద్యోగం లభించడం కష్టంగా మారింది. ఒకవేళ దొరికినా ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ల మధ్య నలిగిపోతూ ఉండేవాళ్లు ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాలని ఆశిస్తుంటారు. స్వయం ఉపాధి కోసం ఎదురుచూసే వారికి ఊళ్లో కాస్త స్థలం ఉంటే చాలు. వారికి మైక్రో ఫార్మింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, నేడు ఎక్కువ మంది కల్తీ, రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యం పాలవుతున్నారు. పక్కా ప్లానింగ్ వేసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు రావడం ఖాయం.
మైక్రో ఫార్మింగ్ ప్రారంభించేందుకు కావలసినవి..
మీ తాహతుని బట్టి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ఎన్ని ఎకరాల్లో చేయాలనేది మీ స్థాయిని బట్టి నిర్ణయించుకోండి.
స్థలం లేదు అనుకునే వారు మేడపై కూడా చేయవచ్చు.
ముల్లంగి, బ్రోకలీ, పొద్దుతిరుగుడు, బఠానీలు, కొత్తిమీర, క్యాబేజీ, ఉసిరికాయ పంటలు లాభసాటిగా ఉంటాయి.
మార్కెట్ విషయంలో స్థానికంగా ముందుగానే మాట్లాడి ఉంచుకుంటే మేలు.
పెద్ద స్థాయిలో మార్కెట్ చేస్తున్నా, పురుగుల మందులు వినియోగిస్తూ లైసెన్స్ తప్పక తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
ఫోన్లలో బిజీగా ఉన్న ప్రయాణికులు.. సడన్‌గా లోపలికి దూరిన ఎద్దు.. చివరకు..
Weight Loss: భారీ కాయంతో విమానంలో ఎక్కలేక.. 82 కేజీల బరువు తగ్గిన యువకుడు
Supreme Court: ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మరిన్ని తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..