Supreme Court: ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:58 PM
ఉచిత హామీల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదనీ సుప్రీంకోర్టు ధర్మాసన అభిప్రాయపడింది. ఉచితంగా రేషన్, పని చేయకుండా డబ్బులు రావడం సరికాదని పేర్కొంది.

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై (Freebies) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొంది. ఉచితంగా రేషన్, డబ్బులు ఇస్తుంటే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi : మళ్లీ పరువునష్టం కేసులో ఇరుక్కున్న రాహుల్ గాంధీ.. సమన్లు జారీ చేసిన కోర్టు..
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. "దురదృష్టవశాత్తూ.. ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. వాళ్లకు ఉచితంగా రేషన్ అందుతోంది. ఏ పనిచేయకుండా డబ్బులు వస్తున్నాయి'' అని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశం మంచిదేనని, అయితే వారిని సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని పేర్కొంది.
దీనిపై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానమిస్తూ, పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే దశలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి యోచిస్తోందని చెప్పారు. దీంతో ధర్మాసనం తిరిగి స్పందిస్తూ పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంత కాలం పనిచేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆరు వారాల తర్వాత తిరిగి విచారణ జరుపుతామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.
రోహింగ్యా శరణార్ధులపై..
రోహింగ్యా శరణార్ధులకు ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లలో అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్య విషయంలో పిల్లల పట్ల వివక్ష ఉండరాడదన్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.