Weight Loss: భారీ కాయంతో విమానంలో ఎక్కలేక.. 82 కేజీల బరువు తగ్గిన యువకుడు
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:52 PM
విమానంలో సీట్లు కూడా సరిపోని స్థాయిలో భారీగా బరువు పెరిగి పోయిన ఓ యువకుడు నానా అవస్థలు పడ్డాడు. ఇలాగైతే 30 ఏళ్లలోపే మరణిస్తానని భావించిన అతడు పట్టుదలతో ఊబకాయాన్ని జయించాడు. ఏకంగా 82 కేజీల బరువు తగ్గాడు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ తమని తాము మార్చుకుని మంచి మార్గంలో పయనిద్దామని అనుకుంటారు. కానీ మెజారిటీ శాతం మందికి ఇది సాధ్యం కాక చివరకు డిప్రెషన్‌లో కూరుకుపోతుంటారు. పరిస్థితి ఇక మారదంటూ నిస్తేజంగా ఉండిపోతారు. భారీ కాయుడైన ఓ ఇంగ్లండ్ యువకుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. భారీ కాయం కారణంగా విమానంలో కూడా అతడు పట్టలేని స్థితి వచ్చింది. ఈ అనుభవం అతడి జీవితాన్నే మర్చేసింది. ఎటువంటి ఔషధాలు, డైట్‌లో పాటించకుండానే బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోయేలా చేసింది.
స్కాట్‌లాండ్‌కు చెందిన ఆరన్ చిడ్‌విక్ వయసు 30 లోపే అయినా బరువు మాత్రం 160 కేజీలు దాటేసింది. 24 ఏళ్ల చిరు ప్రాయంలోనే అతడు ఏకంగా 175 కేజీలకు చేరుకున్నాడు. ఈ బరువు కారణంగా అతడికి జాబ్ కూడా కష్టంగా మారింది. షూ లేసులు కట్టుకోవడం, మార్కెట్‌కు వెళ్లిరావడం, విమానంలో జాగ సీట్లు సరిపోకపోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి (Viral).
Viral: వామ్మో.. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? ఉద్యోగులు కోరిన శాలరీ ఇవ్వలేక...
‘‘నేను ఎక్కడికెళ్లినా అందరూ నన్నే చూస్తుండే వాళ్లు. మైదానాలకు వెళ్లినప్పుడు నేను నడవలేక చమట్లు కక్కతూ ఉండేవాణ్ణి. బరువు కారణంగా నాకు ఆందోళన, డిప్రెషన్ కూడా వచ్చాయి. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ఎక్కడ మొదలెట్టాలో తెలీక ఇబ్బంది పడేవాణ్ణి. ఈ పరిస్థితి నుంచి నన్ను నేను మరిపించుకునేందుకు అతిగా తినడం ప్రారంభించాను. కానీ విమానాల్లో పట్టని స్థితి కూడా రావడంతో నాకు వాస్తవం బోధపడింది. 30 ఏళ్ల లోపే ఊబకాయం కారణంగా చనిపోతానని అనుకున్నాను. నాకు కనీసం ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వరని అనిపించింది. నా జీవతాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను’’ అని ఆరన్ తెలిపాడు.
Viral: ఇది 1బీహెచ్‌కే ఇల్లు అట.. బెంగళూరులో పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?
ఆ తరువాత ఆరన్ బరువు తగ్గేందుకు సహసిద్ధపద్ధతులను అనుసరించాడు. ఎటువంటి ఇంజెక్షన్లు, ఔషధాలు, వేలంవెర్రి డైట్ ప్లాన్లు ఫాలో కాకుండా పౌష్టికాహారం, క్రమం తప్పని కసరత్తులతో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఏకంగా 82 కేజీల బరువు తగ్గి అసలైన యువకుడిలా మారిపోయాడు. తనకు పోయిన కాన్ఫిడెన్స్ మొత్తం తిరిగొచ్చేసిందని అతడు సంబరపడుతూ చెప్పాడు.
తనలాగా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారికి మార్గదర్శకంగా ఉండేందుకు తన అనుభాన్ని నెట్టింట పంచుకుంటున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. నిబద్ధత పట్టుదల ఉంటే బరువు తగ్గడం అసాధ్యమేమీ కాదన్నాడు. త్వరలో తాను మారథాన్‌లో కూడా పాల్గొనబోతున్నట్టు తెలిపాడు.