Share News

Indian Stock Market: ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దీనిపైనే అందరి దృష్టి

ABN , Publish Date - Jan 20 , 2025 | 10:43 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు భారత స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 20న) లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు పెరిగాయి. ఎంత తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం

Indian Stock Market: ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దీనిపైనే అందరి దృష్టి
Indian Stock Markets Gains

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) ఈరోజు (జనవరి 20న) లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య కూడా స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం బలంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 10.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 266.20 పాయింట్లు పెరిగి 76,886.53 స్థాయిలో ఉండగా, నిఫ్టీ50 ఇండెక్స్ 61 పాయింట్ల లాభంతో 23,264.40 స్థాయిలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 503 పాయింట్లు ఎగబాకి 49,033 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 10 పాయింట్లు నష్టపోయింది.


టాప్ 5 స్టాక్స్..

ఈ క్రమంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా, విప్రో, NTPC, బజాజ్ ఫైనాన్స్, SBI కంపెనీల స్టాక్స్ టాప్ 5లో ఉండగా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, HDFC లైఫ్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. మోతీలాల్ ఓస్వాల్ సోషల్ మీడియా వాదనలను తోసిపుచ్చిన తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ 9% పెరిగింది. AGR మినహాయింపు బజ్‌పై వోడాఫోన్ ఐడియా స్టాక్స్ ర్యాలీని విస్తరించాయి. లక్ష్మీ డెంటల్ లిస్టింగ్ షేర్లు మంచి అరంగేట్రం చేశాయి. NSEలో 27% ప్రీమియంతో జాబితా చేయబడ్డాయి.


అందరి ఫోకస్..

అమెరికా అధ్యక్షుడిగా నేడు ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న వేళ అందరి దృష్టి కూడా దీనిపైనే ఉంది. ఆయన చేయనున్న ప్రంసంగంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని అనేక మంది ఆసక్తితో చూస్తున్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడనుంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత 30-స్టాక్‌ల BSE సెన్సెక్స్‌లోని 17 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లోని 18 స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 8.22% లాభంతో ముందంజలో ఉంది. దీని తరువాత, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగిన స్టాక్‌లలో ఉన్నాయి. క్షీణించిన స్టాక్‌లలో శ్రీరామ్ ఫైనాన్స్ 4.10% పడిపోయింది. టాటా మోటార్స్, HCLTech కూడా నష్టపోయాయి.


ఇక రంగాల విషయానికి వస్తే

రంగాల విషయానికొస్తే ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.52% పెరుగుదలతో అత్యధికంగా లాభపడింది. దీని తరువాత మీడియా ఇండెక్స్ 0.98%, నిఫ్టీ బ్యాంక్ 0.57% పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కూడా 0.66% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు కూడా లాభాలను నమోదు చేశాయి. అదే సమయంలో ఆటో ఇండెక్స్ 0.65% క్షీణతతో అత్యధికంగా నష్టపోయింది. దీని తరువాత మెటల్ ఇండెక్స్ 0.44%, ఫార్మా 0.13%, హెల్త్‌కేర్ 0.25%, ఆయిల్ ఇండెక్స్ 0.09% తగ్గాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.07% పెరగగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.02% స్వల్పంగా తగ్గింది.


ఇవి కూడా చదవండి:

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 20 , 2025 | 10:57 AM