Indian Exports China: అమెరికాకు షాక్..చైనాకు భారత ఫుడ్, వ్యవసాయ ఉత్పత్తులు
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:47 PM
మన దేశం నుంచి చైనాకు గతంలో ఎక్కువగా బట్టలు, రసాయనాలు, లోహాలు వంటివి ఎగుమతి అయ్యేవి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఇప్పుడు మన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు చైనా మార్కెట్లో హవా చేయనున్నాయి.
ఇండియా, చైనాతో చిన్నగా మొదలైన సంబంధాలు ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకు చైనాకు మన దేశం కెమికల్స్, మెటల్స్, టెక్సటైల్స్ వంటి పరిశ్రమల ఉత్పత్తులే ఎక్కువగా ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భారతీయ వ్యవసాయ, ఫుడ్ ఉత్పత్తులు చైనాలోకి పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం. ఇది అమెరికాకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు (Indian Exports China). ఎందుకంటే భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు వేస్తామని అమెరికా అనుకుంటే, చివరికి వారికే నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు మనం చైనాకి ఏమేమి పంపుతున్నాం
మిర్చి (Capsicum)
ఆయిల్
కోడిగుడ్లు, prawns
చేపలు, క్రాబ్స్
ఇతర కూరగాయలు, పండ్లు
మొత్తం ఎగుమతుల్లో..
ఇవన్నీ నాన్-పెట్రోలియం ఎగుమతుల్లో చాలా వేగంగా పెరుగుతున్నాయి. FY19 (2018-19)లో చైనాకు మనం పంపిన మొత్తం ఎగుమతుల్లో ఫుడ్, ఫార్మ్ ఉత్పత్తుల వాటా 8.9% మాత్రమే. ఇప్పుడు FY25లో అది ఏకంగా 22.1%కి పెరిగిపోయింది. వెజిటబుల్స్ ఒక్కటే 13.1% వాటాతో ముందున్నాయి. అనిమల్ ప్రొడక్ట్స్ కూడా 7.7% శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మన రైతులకు, ఫార్మ్ ఉత్పత్తిదారులకు ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు.
పాత ఎగుమతులు తగ్గిపోతున్నాయా?
ఈ కొత్త మార్పు వల్ల మన పాత ఎగుమతుల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది.
టెక్సటైల్, దుస్తులు: FY19లో 13% వాటా ఉండేది. ఇప్పుడు అది 3.9%కి పడిపోయింది.
కెమికల్స్: అప్పట్లో 23% ఉండేది, ఇప్పుడు 14% కంటే తక్కువ.
మెటల్స్, ఫ్యూయల్స్ కూడా తగ్గిపోయాయి.
విలుగైన రంగాలు కూడా..
ఇండస్ట్రియల్ సైడ్‌లో కూడా కొన్ని మంచి మార్పులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, మెషినరీ ఉత్పత్తులు 8.4% నుంచి 14.1%కి పెరిగాయి. ఫుట్‌వేర్ కూడా 4% దాకా వచ్చాయి.
ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నామా?
ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. మనం చైనాకు పంపే ఎగుమతులు కాస్త తగ్గిపోతుండగా, మనం అక్కడి నుంచి దిగుమతులు డబుల్ చేసుకోవడం విశేషం.
FY20లో మనం చైనా నుంచి $65 బిలియన్ విలువైన వస్తువులు కొనుగోలు చేశాం. FY25లో అది $113.5 బిలియన్‌కి చేరింది. అంటే మనం మరింతగా చైనాపై ఆధారపడుతున్నాం. అదే సమయంలో మన ఎగుమతులు $16.6 బిలియన్ నుంచి $14.3 బిలియన్‌కి పడిపోయాయి.
మోడీ చైనా పర్యటన
ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో తొలిసారిగా చైనా (తియాంజిన్)లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌కి హాజరయ్యారు. ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో రెండు దేశాల నేతలు భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఇరు దేశాల మధ్య మరికొన్ని ఒప్పందాలు, ఎగుమతులు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి