ITR Filing Online Process: ఐటీఆర్ ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడం ఎలా..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:52 PM
చాలా మంది పన్ను చెల్లించే వారు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇది చాలా ఈజీ ప్రక్రియ. మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే నిమిషాల్లోనే మీరు మీ ITRని ఫైల్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
అనేక మంది పన్ను చెల్లింపు దారులకు ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఎలా ఫైల్ చేయాలో తెలియదు. కానీ సరైన స్టెప్స్ తెలిస్తే ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. జాబ్ చేసే వాళ్లైనా, బిజినెస్ అయినా ఇంటి నుంచే ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. తప్పులు లేకుండా సమయానికి ఫైల్ చేస్తే మీరు పెనాల్టీల నుంచి తప్పించుకోవచ్చు. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కోసం ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేసే ప్రాసెస్ ఎలా అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ (ITR Filing Online Process) తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేయడం ఎలా?
ముందుగా incometax.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. మీ PAN నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయొచ్చు. కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే, PAN నంబర్‌తో సులభంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో e-File ఆప్షన్ క్లిక్ చేసి, Income Tax Return > File Income Tax Return సెలక్ట్ చేయండి
ఇక్కడ మీరు అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2025-26 ఎంచుకోవాలి. ఆపై, ఆన్‌లైన్ ఫైలింగ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
మీ ఆదాయం ఆధారంగా సరైన ITR ఫారమ్ సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు జీతం ఉన్నవాళ్లకు ITR-1 సరిపోతుంది. బిజినెస్ లేదా ఇతర ఆదాయాలు ఉంటే, ITR-2, ITR-3 వంటివి ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో మీ ఆదాయం, ట్యాక్స్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ప్రీ ఫిల్ అయి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చెక్ చేసి, అదనపు ఆదాయం లేదా డిడక్షన్స్ (80C, 80D వంటివి) ఉంటే యాడ్ చేయండి.
ఫామ్ ఫిల్ చేసిన తర్వాత, ట్యాక్స్ కాలిక్యులేషన్ చూడండి. ఏదైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే, సెల్ఫ్-అసెస్‌మెంట్ ద్వారా చెల్లించండి
అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకుని, ఫామ్‌ను వాలిడేట్ చేయండి. చివరకు డిక్లరేషన్‌కు అంగీకరించి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
సబ్మిట్ చేసిన తర్వాత, Aadhaar OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర మెథడ్స్ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయండి. ఇది చాలా ముఖ్యం, లేకపోతే మీ రిటర్న్ పూర్తి కాదు.
ముఖ్యమైన తేదీలు & అప్‌డేట్స్
2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైల్ చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఈ తేదీ ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు వర్తిస్తుంది
మీరు 80C, 80D వంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే, సరైన డాక్యుమెంట్స్, ఆధారాలు సబ్మిట్ చేయాలి. ప్రభుత్వం ఈ ప్రాసెస్‌ను మరింత పారదర్శకంగా మార్చింది. కాబట్టి అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి.
ITR ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్
PAN కార్డ్ & ఆధార్ కార్డ్ (ఈ రెండూ లింక్ అయి ఉండాలి)
ఫారమ్ 16 (జీతం ఉన్నవాళ్లకు)
ఫారమ్ 26AS, AIS, లేదా TIS (మీ పేరుతో చెల్లించిన ట్యాక్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తాయి)
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ (రీఫండ్ కోసం)
ట్యాక్స్-సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆధారాలు (PPF, ELSS, LIC, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, డొనేషన్స్ మొదలైనవి)
హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ (హోమ్ లోన్ ఉంటే)
చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అవసరమా?
ప్రతి ఒక్కరికీ CA అవసరం లేదు. ఉదాహరణకు జీతం లేదా చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే, మీరే ఆన్‌లైన్‌లో ఫైల్ చేయొచ్చు. కానీ, మీ ఆదాయం ఎక్కువగా ఉంటే స్టాక్ మార్కెట్ నుంచి క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఆదాయం లేదా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే CA సాయం తీసుకోవడం బెటర్. వాళ్లు అన్నీ కరెక్ట్‌గా చెక్ చేసి, తప్పులు లేకుండా ఫైల్ చేస్తారు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి