Jumped Deposit Scam: వెలుగులోకి మరో కొత్త స్కాం.. మనీ పంపించి దోచేస్తున్న కేటుగాళ్లు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 10:46 AM
మీరు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే కొత్తగా మరో సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. అదే జంప్డ్ డిపాజిట్ స్కాం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది. దీనిని అరికట్టడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల కాలంలో సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఓటీపీల పేరుతో అనేక మంది అమాయక ప్రజలను లూటీ చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు మరో స్కాంకు తెర లేపారు. అదే జంప్డ్ డిపాజిట్ స్కాం (Jumped Deposit Scam). వీరి లక్ష్యం మొబైల్ మనీ యూజర్లు. ప్రధానంగా మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేసేవారని వీరు లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ గురించి ఇటివల తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అనధికారిక ఉపసంహరణలను నిర్వహించడానికి వినియోగదారులను చీట్ చేస్తున్నారని తెలిపారు.
ఈ స్కామ్ ఎలా పని చేస్తుందంటే..
ముందుగా సైబర్ మోసగాడు ఓ బాధితుడి బ్యాంక్ ఖాతాకు UPI ద్వారా కొంత మొత్తాన్ని, సాధారణంగా రూ. 5,000 పంపిస్తాడు. ఆ తర్వాత బాధితుడు SMS ద్వారా డిపాజిట్ నోటిఫికేషన్‌ను అందుకుంటాడు. ఆ క్రమంలో బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి బాధితుడు బ్యాంకింగ్ యాప్‌ను వెంటనే ఓపెన్ చేస్తే.. మోసగాడు మీ ఖాతా నుంచి పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేయమని అభ్యర్థిస్తాడు. ఆ క్రమంలో మీరు ఆ సందేశం చూడకుండా పిన్‌ను నమోదు చేయడం ద్వారా అందుకు సంబంధించిన ఉపసంహరణ మొత్తం ఆమోదించబడుతుంది. దీంతో మోసగాళ్లు సులభంగా మీ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు.
దీనిని నివారించడం ఎలా..
అయితే ఆ పంపించిన సందేశం ఆధారంగా మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు లూటీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో మీకు అలాంటి సందేశాలు ఏవైనా వస్తే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయకూడదని చెబుతున్నారు. అలాంటివి వచ్చిన వెంటనే 15 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా అలాంటి ఉపసంహరణ అభ్యర్థన తొలగిపోతుంది. దీంతోపాటు ఉద్దేశపూర్వకంగా తప్పు పిన్ నంబర్ మొదటిసారి నమోదు చేయడం వలన కూడా ఆ ఉపసంహరణ అభ్యర్థన రద్దు అవుతుంది. కాబట్టి మీకు వచ్చే ఊహించని డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో వస్తే ముందుగా బ్యాంకును సంప్రదించాలని చెబుతున్నారు.
ఎక్కడ ఫిర్యాదు చేయాలి
ఈ కొత్త స్కాంకు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలకు గురైన బాధితులు సత్వర చర్యలు తీసుకునేందుకు సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి సంఘటనలకు గురైన వారు తక్షణ చర్యల కోసం వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ విభాగం సూచించింది.
ఇవి కూడా చదవండి:
Bhopal Gas: భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..
PM Modi: ప్రధానికి హిందూ సేన విజ్ఞప్తి.. ఈ దర్గాలో అలా చేయోద్దని..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News