Share News

Nirmala Sitharaman GST Reforms: జీఎస్టీ మార్పులు మన సొంత నిర్ణయాలు..అమెరికా ప్రభావం లేదు

ABN , Publish Date - Sep 10 , 2025 | 07:41 AM

ఇటీవలి రోజుల్లో జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Nirmala Sitharaman GST Reforms:  జీఎస్టీ మార్పులు మన సొంత నిర్ణయాలు..అమెరికా ప్రభావం లేదు
Nirmala Sitharaman GST Reforms

మన దేశంలో జీఎస్టీ సంస్కరణల (GST Reforms) గురించి గత కొన్ని రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ సంస్కరణల గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఈ సంస్కరణలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వల్ల వచ్చినవి కావని, గత 18 నెలలుగా మనం సొంతంగా ప్లాన్ చేసినవని స్పష్టం చేశారు.

ఈ సంస్కరణలు మన దేశ అవసరాల కోసం, మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించినవని ఆమె అన్నారు. ఈ సంస్కరణలు గత ఒకటిన్నర సంవత్సరాలుగా సిద్ధం చేసినట్లు చెప్పారు. అంటే, ఈ సంస్కరణలు హఠాత్తుగా, ఏదో అమెరికా సుంకాల ప్రభావంతో వచ్చినవి కాదన్నారు. ఇవి మన సొంత ఆలోచనలు, మన ప్రణాళికల ఫలితమన్నారు.


మార్కెట్‌పై ఆధారపడిన

మరోవైపు అమెరికా 50% సుంకాలు (Us Tariffs) విధించినప్పటికీ, దాని ప్రభావం మన ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన వాళ్లకే ఎక్కువగా ఉందన్నారు. మేము ఈ సుంకాల వల్ల ప్రభావితమైన పరిశ్రమల నష్టాలను అంచనా వేస్తున్నామని, వాళ్ల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా సపోర్ట్ స్కీమ్‌ల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుందన్నారు.

దీంతోపాటు అమెరికాతో దౌత్య పరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని, ట్రేడ్ నెగోషియేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అదే సమయంలో ఈ సుంకాల వల్ల విదేశీ పెట్టుబడులపై (FDI) ప్రభావం పడొచ్చు కాబట్టి, దాన్ని కూడా గమనిస్తున్నామని వెల్లడించారు.


సమాచారం తీసుకుని

ఈ సంస్కరణలు కేవలం ఆర్థిక అంశాలతోనే కాదు, రాజకీయ వాతావరణంతో కూడా ముడిపడి ఉన్నాయి. ఎన్నికల తర్వాత బీజేపీ (BJP) తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ సంస్కరణలు మరింత కీలకంగా మారాయి. పరిశ్రమల నుంచి సమాచారం తీసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నిర్మలా స్పష్టం చేశారు.

తాత్కాలికం కాదు

మార్కెట్‌ల (stock Market) విషయానికొస్తే, గ్లోబల్ అనిశ్చితుల వల్ల ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన ఉందని ఆమె అంగీకరించారు. కానీ సంస్కరణలను మార్కెట్‌ల తక్షణ స్పందనతో జడ్జ్ చేయకూడదని ఆమె పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం, కానీ తాత్కాలిక మార్కెట్ హెచ్చుతగ్గుల కోసం కాదన్నారు. మీరు ఈ సంస్కరణల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 07:41 AM