Share News

Gold Rates on Nov 28: వెండి ధరలకు రెక్కలు.. స్వల్పంగా తగ్గిన పసిడి

ABN , Publish Date - Nov 28 , 2025 | 07:34 AM

రెండు రోజులుగా మార్కెట్లలో భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం నాటికి కాస్త దిగొచ్చాయి. అటు వెండి రేట్లు మాత్రం భారీగా ఎగబాకాయి. మన దేశంలోని ఆయా ప్రముఖ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే...

Gold Rates on Nov 28: వెండి ధరలకు రెక్కలు.. స్వల్పంగా తగ్గిన పసిడి
Gold and Silver Rates today

ఇంటర్నెట్ డెస్క్‌: డాలర్ రేటు పతనమవడం, అమెరికా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో రెండు రోజులుగా భారీ స్థాయిలో ఎగబాకిన బంగారం రేటు.. శుక్రవారం నాటికి స్వల్పంగా తగ్గింది. అటు వెండి ధరలకు రెక్కలు రావడంతో భారీ పెరుగుదలను నమోదుచేసింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 7:00 గంటల నాటికి భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.1,27,740కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,17,090గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,80,100కు ఎగబాకింది(Gold and Silver Rates today).


అమెరికా ఫెడరల్ రిజర్వ్.. ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం, డిసెంబర్‌లో జరిగే మీటింగ్‌లో వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గే సంకేతాలున్నాయి. దీంతో డాలర్ రేటు బలహీనపడటంతో రెండు రోజుల్లో అమాంతం పెరిగిన పసిడి.. శుక్రవారం నాటికి కాస్త దిగొచ్చింది. కానీ, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. అయితే.. ఈ జోష్ స్వల్ప కాలికమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధం ముగింపు దశకు చేరడంతో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తొలిగేలా ఉన్నాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మళ్లీ డిమాండ్ తగ్గి స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశముంది.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(24కే, 22కే, 18కే) ఇలా..

  • బెంగళూరు: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • చెన్నై: రూ.1,28,390; రూ.1,17,690; రూ.98,140

  • ముంబయి: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • న్యూఢిల్లీ: రూ.1,27,890; రూ.1,17,240; రూ.95,950

  • కోల్‌కతా: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • హైదరాబాద్: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • విజయవాడ: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • కేరళ: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • సూరత్: రూ.1,27,790; రూ.1,17,140; రూ.95,850

  • వడోదరా: రూ.1,27,740; రూ.1,17,090; రూ.95,800

  • అహ్మదాబాద్: రూ.1,27,790; రూ.1,17,140; రూ.95,850


వెండి ధరలు(కిలో గ్రాముకు) ఇవీ..

  • బెంగళూరు: రూ.1,73,100

  • చెన్నై: రూ.1,80,100

  • ముంబయి: రూ.1,73,100

  • న్యూఢిల్లీ: రూ.1,73,100

  • కోల్‌కతా: రూ.1,73,100

  • హైదరాబాద్: రూ.1,80,100

  • విజయవాడ: రూ.1,80,100

  • కేరళ: రూ.1,80,100

  • సూరత్: రూ.1,73,100

  • వడోదరా: రూ.1,73,100

  • అహ్మదాబాద్: రూ.1,73,100


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కావున కొనుగోలుదారులు ఈ ధరలను మరోసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

విందు మహా పసందు

త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్‌ ఫైనాన్స్‌

Updated Date - Nov 28 , 2025 | 07:41 AM