Share News

Gold Price: బాబోయ్ మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు..ఈసారి రికార్డ్ స్థాయి ఎంతంటే..

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:17 AM

బాబోయ్ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,199కి చేరింది. అవును బుధవారం (సెప్టెంబర్ 3న) ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.5% పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది.

Gold Price: బాబోయ్ మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు..ఈసారి రికార్డ్ స్థాయి ఎంతంటే..
gold futures record high

బంగారం ధరలు మళ్లీ పైపైకి చేరుతున్నాయి. తాజాగా ఎప్పుడూ లేని విధంగా కొత్త గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్ 3న ఉదయం MCX ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,199కి చేరింది. అంటే దాదాపు 0.5% పెరిగింది. ఇది ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎప్పటికీ లేని రేటు అని చెప్పవచ్చు. ఈసారి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చనే అంచనాలని నిపుణులు చెబుతున్నారు.


ఇన్వెస్టర్ల ఆసక్తి..

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు కూడా దీనిపై ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా తన టారిఫ్ విధానంలో మార్పులు చేయబోమని ట్రంప్ చెప్పడంతో ఆర్థిక అనిశ్చితి పెరిగింది. ఈ సందర్భంలో సేఫ్ హావెన్ అన్న పేరుతో బంగారం మళ్లీ ఫేవరేట్ పెట్టుబడి ఆప్షన్‌గా మారింది. దీంతో అనేక మంది పసిడి పెట్టుబడుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఇన్వెస్టర్లు గోల్డ్‌ & సిల్వర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బేస్డ్ ETF అయిన SPDR Gold Trust హోల్డింగ్స్ 1.32% పెరిగి 990.56 టన్నులకు చేరాయి. ఇది ఆగస్ట్ 2022 తరువాత గరిష్ఠం కావడం విశేషం.


ఇంకా పెరుగుతుందా..

అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర $3,616.70కు చేరింది. ఇది కూడా రికార్డ్ లెవెల్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 17న అమెరికా ఫెడ్ తమ వడ్డీ విధానంపై నిర్ణయం తీసుకోనుంది. అప్పటికే మార్కెట్లు 92% మేర వడ్డీ రేట్లు 0.25% తగ్గుతాయని ఊహించుకుంటున్నాయి. ఈ వారం శుక్రవారం రానున్న US Non-Farm Payrolls డేటా కూడా చాలా కీలకం కానుంది. అది కూడా ఫెడ్ నిర్ణయంపై ప్రభావం చూపించవచ్చు. మరోవైపు రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: గోల్డ్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 10:29 AM