Gold and Silver Rates Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ధర ఎంత తగ్గిందంటే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:01 AM
బిజినెస్ డెస్క్: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,760 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,920గా ఉంది.
బిజినెస్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు వరసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అంతా బంగారం వైపు మెుగ్గు చూపుతున్నారు. దాన్ని సురక్షితమైన పెట్టుబడిగా నమ్మడంతో కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే పసిడికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. కాగా, ఇవాళ (22-02-2025)న గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,760 కాగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,920గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,026 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,210గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ, విశాఖపట్నంలోనూ హైదరాబాద్ రేట్లే కొనసాగుతున్నాయి.
వెండి ధరలు ఇలా..
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,280 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.96,600 పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.96,440 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
ముంబై- రూ.78,898, రూ.86,070
పుణె- రూ.78,898, రూ.86,070
జైపూర్- రూ.78,888, రూ.86,060
పట్నా- రూ.78,852, రూ.86,020
చెన్నై- రూ.79,127, రూ.86,320
బెంగళూరు- రూ.78,962, రూ.86,140
కోల్‌కతా- రూ.78,788, రూ.85,950
భోపాల్- రూ.78,980, రూ.86,160
భువనేశ్వర్- రూ.78,916, రూ.86,090
తిరువనంతపురం-రూ.79,136, రూ.86,330
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: 498.. వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు!
PM Modi: భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు.. మోదీ కీలక వ్యాఖ్యలు