Gold and Silver Rates Today: పైపైకి బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:35 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారు పెరుగుతున్న ధరలను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం నేటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనేది ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి కొనాలని చూస్తున్నవారికి మరోసారి షాక్. పసిడి ధరలు మళ్లీ పెరిగి, రికార్డు స్థాయికి చేరాయి (Gold and Silver Rates Today September 17th). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 17న ఉదయం 6:15 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,194కి చేరింది. 22 క్యారెట్ 10 గ్రాములకు రేటు రూ.1,02,610కి చేరుకుంది. నిన్నటి ధరలతో పోల్చితే, ఇది స్వల్పంగా పెరిగింది. మరోవైపు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.1,44,100కి చేరింది. ఇది నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,194, 22 క్యారెట్‌కు రూ.1,02,610. ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,194, 22 క్యారెట్‌కు రూ.1,02,610. ఢిల్లీలో 24 క్యారెట్ రేటు రూ.1,12,090, 22 క్యారెట్‌కు రూ.1,02,760.
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,12,160, 22 క్యారెట్‌కు రూ.1,02,810. కోల్‌కతాలో 24 క్యారెట్ రూ.1,11,940, 22 క్యారెట్ రూ.1,02,610. బెంగళూరులో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,940, 22 క్యారెట్‌కు రూ.1,02,610. ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల మీద ఆధారపడి స్వల్పంగా మారుతుంటాయి.
వెండి రేట్లు ఇలా..
వెండి ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ.1,44,100కి చేరింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణేలో రూ.1,34,100గా ఉంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో కొనుగోలు దారులు ఇంకా పెరుగుతుందా? కొనేద్దామా వద్దా ? అని చర్చించుకుంటున్నారు. అయితే పండుగల వేళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి