Share News

Qatar Attack: ఖతార్‌పై నెతన్యాహు నాకేం చెప్పలేదు ట్రంప్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:38 AM

ఖతార్‌లో దాడి చేసే ముందు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. దాడులకు కొద్ది సేపటి ముందు నెతన్యాహు ట్రంప్‌కు...

Qatar Attack: ఖతార్‌పై నెతన్యాహు నాకేం చెప్పలేదు ట్రంప్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఖతార్‌లో దాడి చేసే ముందు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. దాడులకు కొద్ది సేపటి ముందు నెతన్యాహు ట్రంప్‌కు సమాచారం ఇచ్చారన్న వార్తా కథనాల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత తమకు సమాచారం అందిందని, దాడులను ఆపేందుకు ట్రంప్‌కు అవకాశం లేకుండా పోయిందని వైట్‌ హౌస్‌ వివరించింది. అంతకుముందు యాక్సియస్‌ వార్తా సంస్థ.. ‘‘ఖతార్‌లో దాడులపై ఇజ్రాయెల్‌ ముందే అమెరికా అధ్యక్ష కార్యాలయానికి సమాచారం తెలియజేసింది’’ అని ఇజ్రాయెల్‌ రక్షణ అధికారులను ఉటంకిస్తూ కథనం రాసింది. దోహాలో హమాస్‌ రాజకీయ నేతలు ఉన్నారంటూ ఇజ్రాయెల్‌ ఈ నెల 9న దోహాలో క్షిపణి దాడులు చేసింది.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 09:45 AM