Share News

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:25 AM

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కొంత ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి కంటే బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ధరలు ఏ మేరకు చేరుకున్నాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Rates Today September 15 2025

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే వీటి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గుముఖం (Gold Rates Today) పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 15, 2025 ఉదయం 6 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160కి చేరింది (Gold and Silver Rates Today September 15 2025). 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,890కి చేరుకుంది. ఇది నిన్నటి ధరలతో పోల్చితే స్వల్పంగా రూ.10 మాత్రమే తగ్గింది. ఇదే సమయంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.132,900కి చేరింది.


ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • గ్లోబల్ మార్కెట్‌లో మార్పులతో భారతదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నగరాల వారీగా ధరలు చూస్తే, స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల ఆధారంగా ధరలు మారుతాయి.

  • ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,11,290, 22 క్యారెట్ రూ.1,02,040. కేజీ వెండి ధర రూ.1,32,900

  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రేటు రూ.1,42,900

  • ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రేటు రూ.1,32,900

  • చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.1,11,170, 22 క్యారెట్ రూ.1,02,190. కిలో వెండి రేటు రూ.1,42,900

  • బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రేటు రూ.1,32,900

  • కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రేటు రూ.1,32,900


ఈ సమాచారం మాత్రం..

ఈ ధరలు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న సమాచారం. ఈరోజు ముగిసేలోపు వీటి ధరల్లో మార్పులు రావచ్చు. కాబట్టి పసిడి కొనుగోలు చేసే సమయంలో వీటి ధరల గురించి మళ్లీ తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. గ్లోబల్ ఫ్యాక్టర్స్, యూఎస్ ఫెడ్ రేట్స్, ఇన్‌ఫ్లేషన్ సహా పలు ఆర్థిక నిర్ణయాలు వీటి ధరలను ప్రభావితం చేస్తాయి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:50 AM