Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:58 AM
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. పసిడి రేట్లు రోజురోజుకూ పెరుగుతుండడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

బిజినెస్ డెస్క్: బంగారం ధరలు గత రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నా ఆది, సోమవారాల్లో స్వల్ప తేడాలు మాత్రమే కనిపించాయి. గతేడాదితో పోలిస్తే పసిడి రేటు మరింత పెరిగింది. రానున్న రోజుల్లో గోల్డ్ ధర రూ.90 వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, ఇతర పరిస్థితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే రోజురోజుకూ రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో పసిడి ప్రియులకు అది మింగుడు పడడం లేదు. శుభకార్యాలు, ఇతర వేడుకలకు గోల్డ్ కొనాలని భావించినా ఆచితూచి అడుగు వేస్తున్నారు.
సోమవారం (24-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,769 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,930గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.78,907 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.86,080గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,035కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,220 వద్ద కొనసాగుతోంది. ఇక, వెండి విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,290గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి రూ.96,460కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ. 96,610గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
చెన్నై- రూ.79,136, రూ.86,330
పుణె- రూ.78,907 రూ.86,080
భోపాల్- రూ.78,989, రూ.86,170
ముంబై- రూ.78,907, రూ.86,080
భువనేశ్వర్- రూ.78,925, రూ.86,100
కోయంబత్తూర్- రూ.79,136, రూ.86,330
జైపూర్- రూ.78,898, రూ.86,070
దిస్పూర్- రూ.79,072, రూ.86,260
బెంగళూరు- రూ.78,971, రూ.86,150
కోల్‌కతా- రూ.78,806, రూ.85,970
ఈ వార్తలు కూడా చదవండి:
టెక్ వ్యూ : మద్దతు స్థాయిలు 22,600, 22,400