FASTag Yearly Pass: ఫాస్టాగ్ ఏడాది పాస్ ఇవి పాటించకుంటే రూ.3,000 లాస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:31 PM
హైవే మీద ప్రయాణం అంటే సౌకర్యంగా గమ్య స్థానానికి చేరుకోవాలని మనం కోరుకుంటాం. కానీ టోల్ బూత్‌ల వద్ద క్యాష్ చెల్లిస్తూ సమయం వృథా చేయకూడదనుకునే వారికి FASTag ఏడాది పాస్ మంచి పరిష్కారం. కానీ ఇది తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు పాటించకపోతే రూ.3,000 నష్టపోయే ఛాన్సుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మనం హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ బూత్‌ల దగ్గర ఆగకుండా, క్యాష్ చెల్లించకుండా వెళ్లిపోవాలంటే ఫాస్టాగ్ ఏడాది పాస్ (FASTag Yearly Pass) ఓ మంచి ఆప్షన్. కానీ, ఈ పాస్ తీసుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు రూ.3,000 నష్టపోయే ఛాన్సుంది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ప్రకారం, ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం రూపొందించబడింది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా, క్యాష్ చెల్లించకుండా స్మూత్‌గా ప్రయాణం చేయవచ్చు.
ఈ పాస్ ఎక్కడ కొనొచ్చు?
ఫాస్టాగ్ ఏడాది పాస్ కొనడం ఈజీ. దీనికోసం టోల్ బూత్ దగ్గరకి వెళ్లాల్సిన పనిలేదు. మీరు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్‌సైట్ లేదా హైవే యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఈ పాస్‌ని తీసుకోవచ్చు. ఈ పాస్ ఒక ఏడాది లేదా 200 ట్రిప్స్‌కి పని చేస్తుంది. ఏది ముందు అయిపోతే అది. అంటే, సంవత్సరం గడువు ముగిసినా లేదా 200 ట్రిప్స్ పూర్తయినా ఈ పాస్ ఎక్స్‌పైర్ అవుతుంది.
యాక్టివేషన్ ఎలా జరుగుతుంది?
పాస్ కొన్న తర్వాత యాక్టివేషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ముందుగా NHAI మీ వాహనం ఈ పాస్‌కి అర్హత ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అన్నీ ఓకే అయితే మీరు రూ.3,000 చెల్లించాలి. పేమెంట్ చేసిన రెండు గంటల్లోనే మీ పాస్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు హైవేల మీద టోల్ పాయింట్ల దగ్గర ఆగకుండా ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు.
కానీ ఇవి పాటించకపోతే మాత్రం రూ.3 వేలు లాస్
మీ ఫాస్టాగ్‌ని వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)తో అప్‌డేట్ చేసుకోవాలి
మీ ఫాస్టాగ్ ను విండ్ స్క్రీన్‌పై సరిగ్గా అతికించాలి
అది మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి
ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు
ఒకవేళ మీ ఫాస్టాగ్ లూజ్‌గా ఉంటే లేదా చేతిలో పట్టుకుని స్కాన్ చేసినా, తప్పుగా ఇన్‌స్టాల్ చేసినా అది పని చేయదు. దీంతో మీరు రూ.3,000 నష్టపోయే ఛాన్సుంది.
ఫాస్టాగ్ ఏడాది పాస్ మీరు రిజిస్టర్ చేసిన వాహనానికి మాత్రమే పనిచేస్తుంది. దీన్ని వేరే కారులో ఉపయోగిస్తే, అది డీయాక్టివేట్ అయిపోతుంది. కేవలం చాసిస్ నంబర్‌తో రిజిస్టర్ అయిన ఫాస్టాగ్‌లు ఈ పాస్‌కి అర్హత లేదు.
రూ.3,000 నష్టం రాకుండా ఏం చేయాలి?
ఫాస్టాగ్ సరిగ్గా ఇన్‌స్టాల్: విండ్‌స్క్రీన్ మీద సరైన ప్లేస్‌లో అతికించాలి. లూజ్‌గా లేదా తప్పుగా ఉంటే స్కాన్ కాదు.
VRN అప్‌డేట్ చేయి: మీ ఫాస్టాగ్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి
మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి