Share News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు సామ్ ఆల్ట్‌మాన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:04 AM

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఓపెన్‌ఏఐ కోనుగోలు కోసం ఆఫర్ ఇచ్చిన క్రమంలో క్రేజీ రిప్లై ఇచ్చారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Elon Musk: ఎలాన్ మస్క్‌కు సామ్ ఆల్ట్‌మాన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..
Elon Musk vs Sam Altman

టెస్లా, స్పేస్‌ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఓపెన్‌ ఏఐని కొనుగోలు చేసేందుకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఈ క్రమంలో 97.4 బిలియన్ డాలర్లను (రూ. 8,46,18,83,29,506) బిడ్‌ చేసినట్లు నివేదికలు వచ్చాయి. అయితే ఈ ఆఫర్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) తనదైన శైలిలో స్పందించారు. ధన్యవాదాలు, కానీ మీరు కోరుకుంటే మేము ట్విట్టర్‌ను 9.74 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు మాస్క్ మామకు గట్టి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.


ఒప్పందాలను దెబ్బతీయడంతో

మస్క్ నేతృత్వంలోని వై క్యాపిటల్, జై వంటి సంస్థలు ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ బిడ్‌ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బిడ్‌తో పాటు ఆసక్తి కలిగిన ఇతర పెట్టుబడిదారులు, హాలీవుడ్ పవర్ బ్రోకర్ అరి ఇమాన్యుయేల్ కూడా దీనిలో భాగస్వాములు అయ్యారని సమాచారం. ఈ బిడ్ ఓపెన్‌ఏఐ సంస్థపై వస్తున్న పెద్ద ఒప్పందాలను దెబ్బతీయడంతో సహా, OpenAI ప్రస్తుత మార్కెట్ విలువను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. సెప్టెంబరులో ఓపెన్‌ఏఐ సదస్సు ప్రకారం ఈ సంస్థకు మరొక USD 40 బిలియన్ల నిధుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. 2023లో ఒపెన్‌ఏఐకి జపనీస్ SoftBank ద్వారా USD 300 బిలియన్లు రానున్నట్లు తెలుస్తోంది.


వీరి మధ్య చాలా వివాదాలు..

మస్క్ 2015లో ఓపెన్‌ఏఐని ప్రారంభించినప్పటికీ, ఆ సంస్థకి చెందిన తన హక్కులను వదిలిపెట్టి 2018లో పోటీ సంస్థ xAIని స్థాపించారు. ఇప్పటి వరకు మస్క్ తన సంస్థను AI కంపెనీలతో పోటీగా నిలబెట్టారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఓపెన్‌ఏఐపై బిడ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ మధ్య చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. 2023లో OpenAI సంస్థ లాభాన్ని సాధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మస్క్ పలు రకాల ఆరోపణలు ఈ సంస్థకు తీవ్రంగా మారాయి. ఈ అంశంపై స్పందిస్తూ మస్క్ వ్యాఖ్యలు తప్పని ఆల్ట్‌మాన్ అన్నారు.


ట్వీట్ల యుద్ధం..

ఆ తర్వాత ఇటివల అమెరికన్ జెండా ఎమోజీని యాడ్ చేసి మీ కొత్త పాత్రలో మీరు అమెరికాకు ముందస్తు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నానని ఆల్ట్‌మాన్ ఓ ట్వీట్ చేశారు. దీని ద్వారా మస్క్ మార్పులను, దేశ భవిష్యత్తుకు అనుగుణంగా మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా ప్రగతికి అత్యుత్తమ మార్గాలుగా నిర్ణయించుకోవాలని సూచించినట్లుగా అనిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓపెన్‌ఏఐకి మస్క్‌ పంపినట్లు ప్రచారం జరుగుతున్న బిడ్‌ చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా వెలుగులోకి రాలేదు. కానీ ఈ ఆఫర్ గురించి అనేక నివేదికలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 11 , 2025 | 11:31 AM