Share News

Bank Holidays September 8: వచ్చే వారం బ్యాంకులకు 4 రోజులు సెలవు..ఇలా ప్లాన్ చేసుకోండి

ABN , Publish Date - Sep 07 , 2025 | 08:57 PM

మీరు వచ్చే వారం బ్యాంకుకి వెళ్లాలనుకుంటున్నారా. ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే పలు కారణాలతో వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays September 8: వచ్చే వారం బ్యాంకులకు 4 రోజులు సెలవు..ఇలా ప్లాన్ చేసుకోండి
Bank Holidays September 8

వచ్చే వారం మీరు ఏదైనా పనికోసం బ్యాంకుకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా. అయితే, ముందు ఈ సెలవుల (Bank Holidays) గురించి తెలుసుకోండి. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. సెప్టెంబర్ 8 నుంచి 14, 2025 వరకు భారతదేశంలోని అనేక ప్రాతాల్లో బ్రాంచ్‌లు మూతపడనున్నాయి. అంటే చెక్కులు, ప్రామిసరీ నోట్స్ వంటి లావాదేవీలు ఈ రోజుల్లో జరగవు. అయితే ఎందుకు, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.


సెప్టెంబర్ 8కి మార్పు

ముంబైలో (Mumbai) ఈద్-ఎ-మిలాద్ సెలవు మొదట సెప్టెంబర్ 5న ఉండాల్సింది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని సెప్టెంబర్ 8, సోమవారానికి మార్చింది. ఎందుకంటే, సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం జరిగింది. ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన రిక్వెస్ట్‌తో, ఈ రెండు పండుగలు ఘర్షణ లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. కాబట్టి ముంబైలో అన్ని ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులు సెప్టెంబర్ 8న బంద్ ఉంటాయి.


సెప్టెంబర్ 8–14 మధ్య బ్యాంక్ సెలవుల లిస్ట్

  • సెప్టెంబర్ 8 (సోమవారం): ముంబైలో ఈద్-ఎ-మిలాద్ సెలవు

  • సెప్టెంబర్ 12 (శుక్రవారం): జమ్మూ, శ్రీనగర్‌లో ఈద్-ఎ-మిలాద్ తర్వాత వచ్చే శుక్రవారం సెలవు

  • సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు

  • సెప్టెంబర్ 14 (ఆదివారం): దేశవ్యాప్తంగా ఆదివారం సెలవు


బ్యాంకులు మూతపడితే ఏం చేయాలి?

బ్యాంక్ బ్రాంచ్‌లు (Banks Close) మూతపడినా, మీరు అనేక సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, UPI, బ్యాంక్ యాప్‌లతో పేమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్ సేవలను వినియోగించుకోవచ్చు. ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీలో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ వారం బ్యాంక్ పనులు ఎలా ప్లాన్ చేయాలి?

మీరు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పని ఉంటే సెప్టెంబర్ 9, 10, 11 తేదీలను ఎంచుకోండి. ఈ రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకులు ఓపెన్‌గా ఉంటాయి. ముంబైలో అయితే సెప్టెంబర్ 8 సెలవు కాబట్టి, ఆ రోజు బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకోవద్దు. అలాగే, జమ్మూ, శ్రీనగర్‌లో సెప్టెంబర్ 12న కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2025 | 09:01 PM